Friday, April 19, 2024
- Advertisement -

కండలు తప్ప బుర్ర పెంచలే అంటూ మెహబూబ్ పై ట్రోలింగ్..!

- Advertisement -

బిగ్‌బాస్‌ షోలో ఫిజికల్ టాస్కుల్లో ఇంటి సభ్యుల రంగులు బయటపడుతున్నాయి. ఫ్రస్ట్రేషన్‌లో కంట్రోలో కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నాల్గో సీజన్‌లో ఇచ్చిన ఉక్కు హృదయం అనే ఈ మొదటి టాస్క్ ఆసక్తికరంగా మారింది. ఈ టాస్క్‌లో రోబోల టీంలో అభిజీత్, కుమార్ సాయి, ఆరియానా, హారిక, దేవీ నాగవల్లి, గంగవ్వ, అవినాష్‌లు ఉంటారు.

మిగతా వారంతా మనుషుల టీంలో ఉన్నారు. సిల్వర్ బంతిని పగలగొడితే ఒక రోబో చనిపోతుంది. చివరి వరకు ఒక్క రోబో అయినా మిగిలినా మనుషుల టీం ఓడిపోతుంది. రోబోలకు అవసరమైన చార్జింగ్ మనుషులు అధీనంలో.. మనుషులకు అవసరమైన తిండి, బాత్రూం వంటివి రోబోలో చేతిలో ఉంటాయని మెలిక పెట్టాడు బిగ్ బాస్. మనుషులు తిండి లేకున్న పర్లేదని అలానే ఉన్నారు.

మనుషుల టీంలో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేయాలని రోబో టీం మెంబర్ అభిజీత్ ఐడియా ఇచ్చాడు. మనుషుల టీంకి మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేశాడు అభిజీత్. దివిని లోపలకు వచ్చేలా చేశారు. ఆమెను గట్టిగా పట్టుకుని చార్జింగ్ పెట్టుకున్నారు. దివిని కిడ్నాప్ చేసి చార్జింగ్ పెట్టుకోవడంపై మనుషుల టీం సభ్యులు రెచ్చిపోయారు. మోహబూబ్, సోహెల్ అదుపుతప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మెహబూబ్ భారీగానే మాటలు తూలాడు. కానీ నెటిజన్లు మాత్రం అతన్ని కామెడీ పీస్‌ను చేసేశారు.

దమ్ముంటే నన్ను తీసుకెళ్లండిరా ఆడవాళ్లతో ఏంటిరా అని ఊగిపోయిన మెహబూబ్‌పై మీమ్స్, ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. కండలు పెంచాడు కానీ బుర్ర పెంచలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సారి ఎలిమినేట్ అయ్యేది మెహబూబ్ అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

అభిజిత్ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న మోనాల్..!

డ్రగ్ కేసులో నమ్రత.. అందుకే తీసుకునేదా ?

బిగ్‌బాస్‌ 4: దోస్తులే.. పగ పట్టారు.. ఈ వారం బయటకు వెళ్లేది ఎవరంటే ?

అఖిల్, అభిజిత్ కి చుక్కలు.. అవినాష్ ప్రేమలో మోనాల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -