Friday, April 26, 2024
- Advertisement -

పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ భాను శ్రీ !

- Advertisement -

భాను శ్రీ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కి ముందు ఈ పేరు చాలా అంటే చాలా తక్కువ మందికి తెలుసు. చిన్న చిన్న రోల్స్ చేస్తూ.. ఇండస్ట్రీలో కొనసాగుతున్న భానుకి బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటివరకూ ఆమె ఎవరో కూడా తెలియని ఎంతో మందికి పరిచయం చేసింది.

ఆ షో తర్వాత సినిమాలతో ప్రోగ్రాంస్ తో వరస ఆఫర్స్ దక్కించుకుంటున్న భాను త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. శివశంకర్ రెడ్డి అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు బిగ్ బాస్ 2లోనే వెల్లడించింది భాను. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫ్యామిలీ కూడా తనని సపోర్ట్ చేయని టైంలో శివశంకర్ తనకు ఎంతో సపోర్ట్ చేశాడు అని తనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. అయితే భాను పెళ్లి చాలా సింపుల్గా చేసుకోబోతుందట.

భాను, శివశంకర్ ఇద్దరూ తమ పెళ్లి టెంపులో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరు కానున్నారని రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది భాను. పెళ్లి తర్వాత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించింది.

ఇప్పటికే లేట్ అయిందని 2020 స్టార్టింగ్ లోనే తమ పెళ్లి ఉండబోతోందని చెప్పింది భాను. డేట్ మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ త్వరలోనే భాను, శివశంకర్ రెడ్డి పెళ్లి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాబోయే భర్తతో కలిసి పట్టాయా సిటీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -