Friday, March 29, 2024
- Advertisement -

శివజ్యోతి కొత్త ఇల్లు చూశారా ?

- Advertisement -

యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి సావిత్రిగా పరిచయం అయ్యింది శివజ్యోతి. ఈమెకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. బిగ్‌బాస్ తెలుగులో అడుగుపెట్టడంతో ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది. బిగ్‌బాస్ షో తర్వాత ఆమె సొంతింటి కలను సాకారం చేసుకొన్నారు. తన ఇంటిని పరిచయం చేస్తూ స్టార్ టీవీ షూట్ చేసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో సందడి చేస్తున్నది. శివజ్యోతి తన ఇంటిని పరిచయం చేస్తూ.. జీవితంలో రెండు కోరికలు ఉండేవి.

ఒకటి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం.. రెండోది సొంత ఇళ్లు ఉండాలని. ఈ రెండు కోరికలు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఇంట్లో నాకు ఇష్టమైన ప్రదేశం ఇదే అంటూ పూజగదిని చూపించింది. ఇప్పటి వరకు ఏమైనా పాపాలు చేస్తే క్షమించు. ఇక ముందు నాకు టెన్షన్లు పెట్టకుండా చూసుకో. నీవు నాకే దిక్కు అంటూ దేవుడికి దండం పెట్టుకొన్నది.ఆ తర్వాత పూజ గది నుంచి వంటగదిలోకి శివజ్యోతి ప్రవేశించింది. నాకు వంట చేయడం వచ్చు.. కానీ మనుషుల బతికేలా చూసుకొంటానని చిన్న సెటైర్ వేసింది. ఆ తర్వాత మేకప్ రూంలోకి వెళ్లారు. దేవుడి రూం తర్వాత నాకు బాగా ఇష్టమైనది ఇదే అంటూ చెప్పింది.

అక్కడి నుంచి బెడ్‌రూంలోకి వెళ్లి పెళ్లి తర్వాత కొనుకొన్న డ్రెస్సింగ్ టేబుల్, ఫ్యాన్, బీరువాను చూపించింది. బెడ్‌రూం నుంచి నుంచి గార్డెన్ ఏరియాలోకి శివజ్యోతి వెళ్లింది. పూల మొక్కలతో ఆహ్లాదకరంగా ఆ ప్రదేశాన్ని అలరించుకోవడం కనిపించింది. ఇదే నా చిన్న ప్రపంచం అంటూ శివజ్యోతి ఎమోషనల్ అయింది. చాలా మంది మా ఇల్లును చూపించమని అడిగారు. సమయం వచ్చింది కాబట్టి ఇలా నా ఇంటిని పరిచయం చేశాను అని శివజ్యోతి పేర్కొన్నది. ఇక బిగ్ బాస్ లో శివజ్యోతి కన్నా పెద్ద సెలబ్రిటీలు ఉన్నప్పటికి ఆమె వాళ్లతో సమానంగా గేమ్ అడింది. అంతేకాకుండా ప్రేక్షకులను తన మాటలతో ఆకట్టుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -