బిగ్ బాస్ వల్ల ఆఫర్స్ పోయాయి.. ఆచార్యలో ఛాన్స్ వచ్చింది కానీ : హిమజ

920
Bigg Boss Fame Himaja To Play A Role In Chiranjeevi Acharya Movie
Bigg Boss Fame Himaja To Play A Role In Chiranjeevi Acharya Movie

బిగ్ బాస్ బ్యూటీ హిమజ లాక్ డౌన్ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ..”ఈ లాక్ డౌన్ లో తినేసి బుగ్గులు పెంచుతున్నా. మామిడి పల్లు తిని బుగ్గలు పెంచుతున్నాను. నాలుగు మామిడి పళ్లు రోజు తింటాను. ఇక మా బిగ్ బాస్ బ్యాచ్ లో నన్ను అందరు డేరింగ్ అంటారు. కానీ అంత డేరింగ్ కాదు నేను. డ

ేరింగ్ అనేది ఒక లేవల్ వరకే. ఇక బిగ్ బాస్ అనేది వేరే ప్రపంచం. బయట నుంచి చూసేది చాలా తక్కువ.. అక్కడ జరిగేది వేరే. ఫోన్, పేపర్, టీవీలు లేకుండా అదో వింత ప్రపంచం. అదో పెద్ద క్వారంటైన్.. బిగ్ బాస్ క్వారంటైన్ కంటే… కరోనా క్వారంటైన్ చాలా బాగుంది. నచ్చింది తినొచ్చు.. పడుకోవాలంటే పడుకోవచ్చు. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లడం వల్ల చాలా ఆఫర్స్ పోయాయి. చాలా మంచి షోలు మిస్ చేసుకున్నా. ఇక మళ్లీ నా లైఫ్ లో మంచి మంచి అవకాశాలు వస్తాయో లేదో కూడా తెలియదు.

ప్రస్తుతం మూడు సినిమాల్లో చేతిలో ఉన్నాయి. జా అనే సినిమాలో నటిస్తున్నా. రెండోది మెగాస్టార్ చిరంజీవి గారి ’ఆచార్య’ మూవీ. ఈ సినిమా డేట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో అప్పుడే లాక్ డౌన్ వచ్చింది. అది నా బ్యాడ్ లక్. లాక్ డౌన్ అయిపోగానే షెడ్యూల్ కి వెళిపోతా. ఇంకో మూవీ ఆఫీషియల్ గా అగ్రిమెంట్ కాలేదు. అవ్వగానే చెబుతాను. ప్రస్తుతం ఆచార్య మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నా” అని హిమజ చెప్పుకొచ్చింది.

Loading...