Friday, April 26, 2024
- Advertisement -

కౌశ‌ల్ వ‌ల్ల షోకి చెడ్డ పేరు వ‌చ్చిందా?

- Advertisement -

గత 104 రోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి రోజు అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 ముగింపు దశకు చేరుకుంది. ఇక శ‌నివారం జ‌రిగిన ఎపిసోడ్‌లో నాని షోని చాలా ఎమోష‌నల్‌గా న‌డిపించాడు. నాని హౌస్‌మెట్స్‌తో మాట్లాడుతు గడిచిన వారం హౌస్‌లో మీ ప్రవర్తన వల్ల చాలా నిరుత్సాహానికి గురయ్యా అన్నారు నాని. గ‌త‌వారం హౌస్ స‌భ్యులు మ‌ధ్య గొడ‌వ‌లు తార‌స్థాయికి చేరాయి. కౌశ‌ల్ ఇంటి స‌భ్యుల‌ను కుక్క‌ల‌తో పోల్చ‌డంతో ఈ గొడ‌వ పెద్ద‌దిగా మారింది.

దీనిపై కౌశ‌ల్‌తో మాట్లాడిన నాని , ఈ గొడ‌వ‌పై వివ‌ర‌ణ కోరాడు. కౌశ‌ల్ మాట్లాడుతు… నేను టేబుల్ దగ్గర తినేటప్పుడు వీళ్లందరూ.. జీపీడీ అంటారు దాని మీనింగ్ ఏంటో అర్ధం కాదు. అలానే తాను కూడా కొన్ని షార్ట్ కట్స్‌లో అనుకుంటా అలా వచ్చిందే ఈ షార్ట్ కట్. తన దృష్టిలో కుక్క అంటే.. ‘కూర్చుని ఉండకుండా కేవ్ కేవ్ అరిచేవాడు’ అంటూ కొత్త అర్ధం ఇచ్చారు కౌశల్. కౌశ‌ల్ ఇచ్చిన వివ‌ర‌ణ నానికి న‌చ్చ‌క పోవ‌డంతో..మీరు మాట్లాడే దానిలో లాజిక్ లేదన్నారు. ఆవేశంలో టంగ్ స్లిప్ కావడం కామన్ అని.. అదే నువ్ చెప్తే మ్యాటర్ క్లోజ్ అన్నారు నాని. మీరు ఎన్నిఅన్నా ఎలాంటి అర్ధంతో అన్నా మీరందరి వల్ల హౌస్‌కి చెడ్డపేరు వచ్చిందన్నారు నాని. ఇక కౌశ‌ల్ మీ క‌న్నా కూతురు ఎక్కువ ఫేమ‌స్ అయింద‌ని తెలిపాడు నాని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -