Thursday, April 25, 2024
- Advertisement -

ఈ వారం రోల్ రైడా అవుట్ తనీష్ మెడపై కత్తి

- Advertisement -

తోటి కంటెస్టెంట్ల భజన చేసుకుంటూ, వారి అడుగులకు మడుగులొత్తుకుంటూ, ఎవరి వద్ద వారి మాటలాడుతూ ఇన్నాళ్లూ బిగ్ బాస్ హౌస్ లో నెట్టుకొచ్చిన రోల్ రైడా ఎలిమినేషన్ దాదాపు కన్ఫామ్ అయిపోయింది. 99 శాతం ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నది అతడే. తనీష్ ఎలిమినేట్ అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం రోల్ రైడా కుక్కలతో పోల్చుతావా ? అంటూ కౌషల్ మీద పడిపోయి రచ్చరచ్చ చేసేసి, ఏడుపులు పెడబొబ్బలతో పొర్లు దండాలతో ఆస్కార్ రేంజులో నటించేశాడు. మాటాడితే నేను గల్లీ పోరగాడ్ని, గల్లీ ప్రజల ప్రతినిధిని, గల్లీ పవర్ అంటూ…గల్లీ ప్రజల ఓట్లు కొట్టేద్దామని చాలా ఓవర్ యాక్టింగ్ చేశాడు రోల్ రైడా. అంతలా గల్లీ జపం చేసే రోల్ రైడాకు గల్లీలో జనం సాధారణంగా నిత్యం వాడే కుక్కలాగా మొరుగుతున్నావ్. కుక్కలా అరుస్తున్నావ్. ఏంట్రా కుక్కలా వెంటపడుతున్నావ్. కుక్కలా వాసన చూస్తున్నావ్ . వంటి పదాలు వాడతారని తెలియదా ? ప్రజలు నిత్యం తోటి మనుషులను కుక్కలతో పోల్చడం అనేది కామన్. కానీ దాన్ని పెద్ద రాద్ధాంతం చేసేసి రోల్ రైడా నటనకు జీవం పోసేశాడు. ఇక వీడిని భరించడం మా వల్ల కాదు బిగ్ బాస్…అనే రేంజ్ లో ప్రేక్షకులను విసిగించేశాడు. దీంతో స్వతహాగానే ఇతగాడు నామినేషన్లలో ఉంటే తక్కువ ఓట్లు పడుతుండేవి. ఈ వారం ఆ శాతం మరింత పడిపోయింది. కేవలం 3 శాతం ఓట్లు సాధించడానికే రోల్ రైడా ఈ వారం ఆపసోపాలు పడాల్సిం పరిస్థితి. దీంతో ఎప్పటిలాగే కౌషల్ 60 శాతం ఓట్లుతో ఫస్ట్ ప్లేసులో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాడు. 30 శాతం ఓట్లుతో గీతామాధురి, దీప్తి నల్లమోతు సెకండ్, థర్డ్ స్థానాల్లో నిలిచారు. కేవలం 10 శాతం ఓట్లునే తనీష్, సామ్రాట్, రోల్ రైడా సరి పెట్టుకోవాల్సి వచ్చింది. పైగా సేవ్ యువర్ ఎగ్ టాస్క్ ద్వారా నేరుగా సామ్రాట్ ఫినాలేకి వెళ్లిపోయాడు. దీంతో ఆఖరి స్థానాలైన నాలుగు, ఐదు స్థానాలకు తనీష్, రోల్ రైడా పోటిపడ్డారు.

అయితే గతవారమే అతి తక్కువ ఓట్లుతో రోల్ రైడా ఎలిమినేట్ కావాల్సింది. కానీ అతి స్వల్ప మెజార్టీ అమిత్ పై సాధించడంతో ఆ వారం సేవ్ అయ్యాడు. ఈ వారం నాలుగో స్థానంలో తనీష్, ఐదో ప్లేసులో సామ్రాట్, ఆరో స్థానంలో రోల్ రైడా నిలిచారు. అయితే రోల్ రైడా, సామ్రాట్ మధ్య ఈ వారం మొదటి నుంచి స్వల్ప తేడా కొనసాగింది. ఒక రోజు రోల్ ఆధిక్యంలో ఉంటే, ఇంకో రోజు సామ్రాట్ ముందంజ వేశాడు. మొత్తంగా చూసుకుంటే, ఈ వారమంతా వీరిద్దరిలో ఎవరో ఒకరు ఔట్…అనే రీతిలోనే ఓటింగ్ కొనసాగింది.

మరో వైపు సేవ్ యువర్ ఎగ్స్ టాస్క్ ద్వారా సామ్రాట్ నేరుగా ఫినాలేకి వెళ్లిపోయాడు. దీంతో తక్కువ ఓట్లుతో ఆరో స్థానంలో నిలిచిన రోల్ ఎలిమినేషన్ దాదాపు ఖరారైపోయింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉంది గురువారం రాత్రి బులెటిన్ చూశాక, సామ్రాట్ డైరెక్ట్ ఫినాలేకి వెళ్లిపోయాక, ఇక తనీష్ నాలుగో స్థానంలో, రోల్ ఐదో స్థానంలో నిలిచారు. మొదట్నించీ తనీష్ ఓవరాక్టింగ్, కౌషల్ ను టార్గెట్ చేయడం, ఉత్తర కుమార ప్రగల్భాలు, మంగమ్మ శపథాలు చేసేసి బయటకు వచ్చాక చూసుకుందాం, నేనేంటో చూపిస్తా, నీ సంగతి తేల్చేస్తా…రెచ్చిపోయిన తనీష్ ను కౌషల్ ఆర్మీ టార్గెట్ చేసింది. గురువారం బులెటిన్ ముగిశాక, సామ్రాట్ ఎటూ ఫనాలేకి వెళ్లిపోయాడు కనుక కాస్తా ఆలోచనలో పడ్డారు కౌషల్ అభిమానులు. మీ ఇసుక జాగ్రత్త టాస్కులో కౌషల్ కాన్సంట్రేషన్ అంతా తనీష్ ను ఎలాగైనా ఫినాలేకి వెళ్లకుండా అడ్డుకోవాలనే పెట్టాడు. దీప్తి, సామ్రాట్ వెళ్లినా ఫర్వాలేదు కానీ, తనీష్ మాత్రం వెళ్లకూడదని గట్టిగా ఫైట్ చేశాడు. అనుకున్నది సాధించాడు. అయితే ఆ టాస్క్ ద్వారా డైరెక్టుగా వెళ్లకుండా కౌషల్ అడ్డుకున్నాడు. అసలు పూర్తిగా వెళ్లకుండా అడ్డుకోవాలని, ఇంతవరకూ అన్న ఏదనుకుంటే అది చేసి చూపించాం. ఇప్పుడు తనీష్ ఫినాలేకి వెళ్లకూడదని కోరుకుంటున్నాడు కనుక అది కూడా నెరవేర్చుదామని కొందరు కౌషల్ అభిమానులు భావించారు. అందుకే గురువారం నుంచీ రోల్ కు కొంచెం కొంచెం ఓట్లు స్ల్పిట్ చేస్తూ ఐదో స్థానంలో ఉన్న అతడిని నాలుగో స్థానంకు మెల్లగా చేర్చేసే, నాలుగో ప్లేసులో ఉన్న తనీష్ ఐదో స్థానంకి వచ్చి ఎలిమినేట్ అయిపోతాడని భావించి ఆ రకంగా కొన్ని ఓట్లు స్ప్లిట్ చేశారు. సో ఆఖరి రెండు రోజులు అంటే గురువారం, శుక్రవారం జరిగిన ఓటింగ్ రోల్ రైడా ఎలిమినేషన్ ను ఆపి, ఫినాలేకి పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాలుగో ప్లేసులో ఉండి, ఎలిమినేషన్ తప్పించుకుని, ఫినాలేకి వెళ్లాల్సిన తనీష్ ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అది బిగ్ బాస్ ఏదైనా జరగొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -