బిగ్ బాస్ శ్రీముఖి రెచ్చిపోయి రచ్చ చేసింది

2347
Bigg Boss Telugu 3 Sreemukhi Enjoys Maldives Island Beaches
Bigg Boss Telugu 3 Sreemukhi Enjoys Maldives Island Beaches

బిగ్ బాస్ లో దాదాపు 105 రోజుల పాటు ఉండి చివరి ఫైనల్ లో రాహుల్ చేతిలో ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది శ్రీముఖి. అయితే విజేతగా నిలవకపోయినా బిగ్ బాస్ లో కోట్లాది మంది మనసులు గెలిచింది. బిగ్ బాస్ కు రేటింగ్ తెచ్చిపెట్టింది. అన్ని రోజులు బిగ్ బాస్ లో ఉన్నందుకు శ్రీముఖికి రాహుల్ కంటే ఎక్కువే ప్రైజ్ మనీ వచ్చినట్టు గుసగుసలు వినిపించాయి.

అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీముఖి ఎక్కడా కనిపించడం లేదు. టీవీ షోల వాళ్లు మళ్లీ పిలవాలని చూసినా స్పందించలేదు. బిగ్ బాస్ తోటి కంటెస్టెంట్స్ పార్టీలకు పిలిచినా రాలేదు. మీడియాకు చిక్కడం లేదు.ఇంటర్వ్యూలో, బయటా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎక్కడికి వెళ్లిపోయిందని అంతా ఆలోచిస్తున్న వేళ తాజాగా మల్దీవుల్లో సందడి చేసింది.

అయితే 105 రోజుల పాటు బిగ్ బాస్ లో ఉన్న శ్రీముఖి బాగా అలిసిపోయింది. అందుకే రిలాక్స్ అవ్వడం కోసం సముద్రంలోని దేశమైన మల్దీవులకు వెళ్లింది. అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి తెగ సందడి చేస్తోంది. తాజాగా గ్యాంగ్ లీడర్ లోని పాటలకు స్పెప్పులేసి తెగ సందడి చేసింది.

శ్రీముఖితోపాటు మరో యాంకర్ విష్ణు ప్రియ, రాజ్ చైతను కూడా ఇందులో చూడవచ్చు. ఆమె తమ్ముడు కూడా ఈ పాటలో కనిపించాడు. మల్దీవుల నుంచి తిరిగి వచ్చాక కుటుంబంతో గడిపి తరువాత షోల్లో పాల్గొంటానని శ్రీముఖి చెబుతోంది.

శ్రీముఖి మాల్దీవుల్లో చేస్తున్న సందడి వీడియో..

Loading...