Friday, March 29, 2024
- Advertisement -

విశ్లేషణ: ఫైనల్స్ లో ఉండే అర్హత వారికే ఉంది

- Advertisement -

రాహుల్: మొదట్లో రాహుల్ ని అందరు పులిహోర రాజా అన్నారు.. తరువాత ఛీ ప్రతి దానికి గీవ్ అప్ అంటాడు అనుకున్నారు.. భూతులు మాట్లాడుతున్నాడు గలీజ్ గాడు అన్నారు. కానీ రాహుల్ మధ్య మధ్యలో చెప్పే మాటలు వింటే వీడిలో ఏదో విషయం ఉంది అనుకున్నారు… శ్రీముఖి నామినేట్ చేసిన, హిమజ విషయంలో తప్పు చేసినా, శివజ్యోతిని రెచ్చగొట్టినా అన్నీ ఆ క్షణం వరుకే తరువాత అన్నీ మామూలే, అంతా హ్యాపీసే రాహుల్ మనసులో. అది అర్థం అయ్యాక జనాలు రాహుల్ ని మా కాకా, మా చీచా అనుకుంటున్నారు. బయట సింగర్ గా రాహుల్ కి 100 కి 80 మార్కులు పడితే ఇక్కడ మాత్రం రాహుల్ పాటలతో పిచ్చోళ్ళు అయిపోతున్నారు జనాలు అందుకే 100 కి 100 ఇచ్చేస్తున్నారు. సో రాహుల్ టాప్ 5 లో ఉండటానికి సరైనోడు.

శ్రీముఖి : మొదట్లో అంత ఫుల్ ఫామ్ లో ఉన్న కెరీర్ పక్కకి పెట్టి ఎందుకు వచ్చింది అనుకున్నారు, ఎక్సీపీరియన్స్ కోసం వచ్చాను అని శ్రీముఖి క్లారిటీ ఇచ్చే వరకూ. తన ఆట చూసి కొంతమంది అభిమానులు అయితే కొంతమంది తన అరుపులు చూసి తనని పక్కకి పెట్టేసారు. ఒకానొక టైంలో ఆమె బయటకి వచ్చేస్తే బాగుండు అనుకున్నారు. కానీ ఆమె ప్లాన్ చేసింది అంటే ఎంతటి వారినైనా మభ్యపెట్టి, ఏధైనా చెయ్యగల తెలివి తనది… నిజం చెప్పాలంటే అలాంటి ఆటతీరే గేమ్ లో మజా తెస్తుంది. గేమ్ ఆడేటప్పుడు కొన్ని సార్లు పిచ్చి పనులు చేసి ఆట రద్దు అయ్యేలా చేసినా.. తను ఆడితే ఆ మజానే వేరు. సో శ్రీముఖి టాప్ 5 లో ఉండటానికి కరెక్ట్.

వరుణ్ : సినిమాలలో మనం చూసిన వరుణ్ కాదు బాగ్ బాస్ హౌస్ లో ఉన్న వరుణ్. అంత మెచ్యూరిటీ, నెమ్మది, ఎవరినైనా మొటివేట్ చేసే తత్వం ఇవన్నీ తెలుగు పరిశ్రమకి, అభిమానులకి వరుణ్ ఇక్కడికి వచ్చాకే తెలిసింది. వితిక భర్త అయినా సరే రాహుల్ ప్రాణస్నేహితుడైనా సరే పున్ను అన్న అయినా సరే వారిదే కరెక్ట్ అయితేనే సపోర్ట్ చేస్తాడు లేకపోతే చెయ్యడు అలాంటోడు వరుణ్. మొదటి రెండు వారాలు కొంచెం జనాలకి వరుణ్ నచ్చకపోయినా, తరువాత ఇంటబయట ఫ్యాన్స్ అయిపోయారు వరుణ్ కి. రోజురోజుకీ తనని తాను, తన ఆటని ఇంప్రూవ్ చేసుకుంటున్న వరుణ్ టాప్ 5 లో ఉండటానికి కరెక్ట్.

శివజ్యోతి : శివజ్యోతి అంటేనే గుర్తు వచ్చేది ఏడుపే. కానీ అది ఎవరికీ అడ్డురాలేదు ఇప్పటిదాకా, అసలు తన ఆటకే అడ్డు రాలేదు. అందరిలోనూ ఏదో ఒక మైనస్ ఉంటుంది కానీ ఏ మైనస్ లేకుండా ఆటని గొప్పగా ఆడుతుంది జ్యోతి. ఎవరితో గొడవపడినా నోరుజారి మాట్లాడదు అది తనలో ప్లస్. ఎంతవరకూ అయినా వాధిస్తుందే కానీ నోరుజారదు. గేమ్ లో తన 100% ఇస్తుంది, ప్రతి దాంట్లో ఆక్టివ్ గా పార్టిసిపెట్ చేస్తుంది. సో తనకి గేమ్ లో టాప్ 5 లో ఉండటానికి అర్హత ఉంది.

బాబా భాస్కర్ : ప్రేక్షకులకి ఈయన క్యాష్ ప్రోగ్రామ్ లో వస్తేనే గంటలో నవ్వీ నవ్వీ పొట్ట చెక్కలయిపోతుంది. అలాంటిది 100 రోజులు ఒక చోట ఉండి నవ్విస్తాడంటే ఎవరు కాదంటారు, ఆయన కోసమే షో ఫాలో అయ్యేవారు కూడా ఉన్నారు. భాష రాక కొంచెం, గొప్ప తెలివితో కొంచెం చేసేసి ఫుల్ నవ్విస్తుంటారు బాబా. కొంతమంది ఆయన్ని గ్రేట్ గేమ్ ప్లానర్ అన్నా కూడా గేమ్ కి వచ్చిందే గేమ్ ఆడి పోవడానికి మళ్ళీ ప్లానర్ ఏంటి. ఆయన ఆడేది ఆటే.. సో తనకి గేమ్ లో టాప్ 5 లో ఉండటానికి అర్హత ఉంది.

మహేష్ : కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడు. కొంతమంది మనుషుల మధ్య గొడవలు పెడితే ఇతను మాత్రం గ్రూపుల మధ్యే గొడవ పెట్టీ పెట్టనట్టు పెడతాడు. అది ఒక రకమైన ఆటే కానీ హౌస్ ప్రశాంతతని చెడగొట్టే ఆట. తను మారాడా లేక నటిస్తున్నాడా అనేది జనాలే అభిప్రాయం చెప్పాలి… మహేష్ టాప్ 5 లో ఉండాలా వద్ధా.. ?

పునర్నవి : అందాల భామ.. కోపంలో సత్యభామ.. వయ్యారంలో గొల్లభామ.. ఈ అర్హతలు నటనకి, ఆటకి కాదు. పునర్నవిలో గేమ్ స్పిరిట్ లేకపోవడమే తనకి పెద్ద మైనస్. సో తనని ప్రేక్షకులు ఎక్కడ ఉంచాలి అనుకుంటున్నారు అనేది వారికే వధిలేస్తున్నాం.

వితిక : బిగ్ బాస్ కోడలి కి పైకి మాట్లాడే ధైర్యం లేదు. మొన్నటి దాకా పునర్నవి, ఇప్పుడు శ్రీముఖి, ఆల్ టైమ్ వరుణ్ ఇది తప్ప గేమ్ స్ట్రాటజీ లేదు వితికకి. తన ప్రభావం వరుణ్ మీద పడనివ్వకుండా ఉంటే చాలు ఈవిడ కొత్తగా ఏం ఆడక్కర్లేదు. సో తనని ప్రేక్షకులు ఎక్కడ ఉంచాలి అనుకుంటున్నారు అనేది కూడా వారికే వధిలేస్తున్నాం.

అలి రెజా : ఇతని గురించి చర్చ కూడా దండగే. ఎందుకంటే ఇది చాలా తప్పు. రాహుల్ ని వెనక్కి తీసుకువచ్చినట్టు కూడా కాదు ఇది. సో అలీ ని ప్రేక్షకులు ఎక్కడ ఉంచాలి అనుకుంటున్నారు అనేది కూడా వారికే వధిలేస్తున్నాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -