Thursday, April 25, 2024
- Advertisement -

బిగ్ బాస్ 3 ఫస్ట్ ఎలిమినేషన్: హేమ

- Advertisement -

మొదటి రెండు సీజన్ల మాదిరి కాకుండా బిగ్ బాస్ టీవీ షో లో ఈ సారి మూడో సీజన్ లో మొదటి రెండు మూడు రోజుల లోనే ఎక్కువ మంది ఇంటి వాళ్ళు గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టారు. అంతే కాకుండా ఈ సారి షో లో గొడవలు జరుగుతున్నా మళ్ళీ వెంటనే కలిసి పోతున్నారు.అయితే ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే మొదటి వారం ఎలిమినేషన్ జోన్ లో ఆరుగురిని ఉంచారు. ఈ సారి ఎంపిక ఒక కొలమానం లేకుండా జరిగింది. అందుకని ఎందరో బాగా పెర్ఫర్మ్ చేస్తూ ఉండటం తో ఎవరు షో లో ఉంటారు ఎవరు ఉండరు అనే విషయం పై ఎవరూ ఏకాభిప్రాయం తో లేరు.

అయితే డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు హిమజ, పునర్నవి, హేమ, రాహుల్, వితిక మరియు జాఫర్ కాగా నాగార్జున శనివారం ఎపిసోడ్ లో హిమజ మరియు పునర్నవి సేఫ్ అని ప్రకటించడం జరిగింది. వితిక, హేమ, రాహుల్, జాఫర్ ల లో ఎవరు షో లో నుండి వెళ్ళిపోతారు, ఎవరు షో లో ఉండిపోతారు అనే విషయం ఆదివారం ఎపిసోడ్ లో చెపుతా అని నాగార్జున ప్రకటించాడు. అయితే వీళ్ళలో హేమ ఇప్పుడు షో నుంచి బయటకు వెళ్ళిపోయింది అనే రూమర్స్ వస్తున్నాయి. దాదాపుగా అదే నిజం అని కూడా తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -