టెలివిజన్ చరిత్రలో కొత్త రికార్డు ను క్రియేట్ చేసిన బిగ్ బాస్ 3

548
Bigg Boss Telugu Season 3 heigest TRP Ratings
Bigg Boss Telugu Season 3 heigest TRP Ratings

వివాదాస్పదాలతో మొదలైన బిగ్ బాస్ 3 రేటింగ్ లో మాత్రం దూసుకపోతోంది. ఇక సోషల్‌ మీడియా సంగతి చెప్పనక్కర్లేదు. తమ అభిమాన కంటెస్టెంట్ల పేరిట పేజీలు నడిపిస్తూ మద్దతు తెలుపుతున్నారు. దాదాపు ఇంటి సభ్యులందరికీ సపరేట్‌ సైన్యం ఉంది. ఆర్మీల పేరిట ఎవరికి వారు తమ అభిమాన కంటెస్టెంట్ల తరుపున చాటింపు వేసుకుంటున్నారు.

ఇలా చేస్తుంటె రేటింగ్ టీఆర్పీ ఎక్కడికో వెళ్లి కూర్చుండదా మరి. టీఆర్సీ రేటింగ్‌ విషయంలో, నగరంలో ఈ షో రేటింగ్‌, బిగ్‌బాస్‌ను వీక్షించే వారి సంఖ్య, వారం రోజులపాటు ట్రెండ్‌ ఎలా కొనసాగిందే ఓ రిపోర్ట్‌​ వచ్చేసంది. ఏకంగా ఈసీజన్ లాంచ్ ఎపిసోడ్ 17.9 టి ఆర్ పి రేటింగ్స్ ను రాబట్టి టెలివిజన్ చరిత్రలో కొత్త రికార్డు ను క్రియేట్ చేసింది. గత రెండు సీజన్ల కంటే ఈ సీజన్ లాంచింగ్ రేటింగ్ ఎక్కువ కావడం విశేషం. హైదరాబాద్‌లో 19.7తో రికార్డు సృష్టించింది. మొత్తంగా 4.5కోట్ల మంది వీక్షించినట్లు ప్రకటించారు.

2017 లో ఈ షో ను తెలుగు ప్రజలకు పరిచయం చేయగా మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వ్యవహరించాడు. ఆ సీజన్ లాంచ్ ఎపిసోడ్ కు 16.18 టి ఆర్ పి రేటింగ్స్ వచ్చాయి. ఎన్టీఆర్ ఈ షో ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయడంలో నూటికి నూరు శాతం విజయం సాధించాడు. భారీ అంచనాల మధ్య గత ఏడాది బిగ్ బాస్ 2 ప్రారంభం కాగా న్యాచురల్ స్టార్ నాని ఆ సీజన్ కు వ్యాఖ్యాత గా వ్యవహరించాడు. ఆ సీజన్ లాంచ్ ఎపిసోడ్ కు 15.05 టి ఆర్ పి రేటింగ్స్ వచ్చాయి.

ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ కాగా కింగ్ నాగార్జున ఈ షో కి వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ లాంచ్ ఎపిసోడ్ అన్ని సీజన్ల కంటే ఎక్కువగా 17.9 టి ఆర్ పి రేటింగ్స్ ను రాబట్టిందని స్టార్ మా యాజమాన్యం ప్రకటించింది. దీన్ని బట్టి తెలుస్తోంది మన్మథుడు నాగ్ స్టామినా ఏంటో…

Loading...