శ్రీముఖి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగార్జున

202
Bigg Boss Telugu Season 3 : Nagarjuna Serious Class to Sreemukhi
Bigg Boss Telugu Season 3 : Nagarjuna Serious Class to Sreemukhi

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ మూడవ సీజన్ బోలెడంత డ్రామా తో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో ఇచ్చిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ టాస్క్ లో కొందరు ఇంటి సభ్యులు టాస్క్ ఆడకపోగా బిగ్బాస్ కి ఎదురుతిరిగి టాస్క్ గురించి బిగ్ బాస్ ని నిందించడం మొదలుపెట్టారు.

ముఖ్యంగా టాస్క్ లో దయ్యాలు గా మారిన ఇంటి సభ్యులు మళ్లీ మనుషులుగా మారడానికి ప్రయత్నించాలని బిగ్బాస్ చెప్పినప్పటికీ శ్రీముఖి తామింక టాస్క్ చేయలేమని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది.

ఈ నేపథ్యంలో మాట్లాడుతూ నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున శ్రీముఖి పై సీరియస్ అయ్యారు. బిగ్ బాస్ ని నిందించడం పై శ్రీముఖి మరియు పునర్నవి లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీముఖి ని ఉద్దేశిస్తూ “ఈ హౌస్ లో నువ్వు బాస్ ని అనుకుంటున్నావా? ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ బిగ్ బాస్ మాత్రమే బాస్” అని నాగార్జున శ్రీముఖి కి సీరియస్ గా క్లాస్ పీకారు.

మరోవైపు నిన్నటి ఎపిసోడ్ లో హిమజా నామినేషన్స్ నుంచి సేఫ్ జోన్ లోకి రాగా, శిల్ప చక్రవర్తి, శ్రీముఖి, మహేష్, పునర్నవి మాత్రం ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరు ఇవాళ బిగ్బాస్ ఇంటి నుంచి వెళ్ళిపోబోతున్నారు.

Loading...