బిగ్ బాస్: రెండో వారం నామినేషన్ లో ఎనిమిది మంది

546
Bigg boss telugu season 3 Second Week Nomination zone
Bigg boss telugu season 3 Second Week Nomination zone

మొదటి వారం ఎలిమినేషన్ లో హేమ బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే హేమ వెళ్ళిపోగానే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రి ని ఇంట్లో కి తీసుకొని వచ్చారు నిర్వాహకులు. నిన్న ఆమెని అందరికీ పరిచయం చేయగా, ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో ఆమె ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. రావడం తో నే మహేష్ కి వరుణ్ సందేశ్ కి గొడవ పెట్టేలా బిహేవ్ చేస్తున్నారు ఆవిడ. వరుణ్ సందేశ్ మీద అయిష్టం తో ఆమె పదే పదే మాట్లాడటం జరిగింది. అది పక్కన పెడితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నామినేషన్స్ స్వీకరించారు బిగ్ బాస్.

ఆసక్తికరం గా చాలా మందే ఈ సారి నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేట్ అయిన సభ్యులు శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితిక షేరు, పునర్నవి భూపాళం, రాహుల్ సిప్లిగంజ్.

ఇక ఆసక్తికరమైన ఇంకో అంశం ఏంటి అంటే తదుపరి ఎపిసోడ్ ప్రోమో లో బిగ్ బాస్ ఇంటికి నీటిని, గాస్ ని నిలిపివేయడం జరిగింది అని బిగ్ బాస్ తెలియజేయడం. ఏం జరిగింది అనేది తదుపరి ఎపిసోడ్ చూస్తే అర్ధం అవుతుంది.

Loading...