ప్రతి వారం తననే నామినేట్ చేస్తాను అంటున్న శ్రీముఖి

445
Bigg Boss Telugu Season 3: Sreemukhi Vs Rahul Sipligunj
Bigg Boss Telugu Season 3: Sreemukhi Vs Rahul Sipligunj

బిగ్బాస్ సీజన్ 3 హైడ్రామా తో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఎపిసోడ్ లో అలీ రెజా కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి బిగ్ బాస్ హౌస్ కి ఈవారం కెప్టెన్ గా మారాడు. ఇంటి సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకుంటుండగా, శ్రీముఖి ఇంట్లో ఎవరూ ఎవరి మీద పర్సనల్ ఎటాక్ చేయకూడదని చెప్పింది. ఎగ్జాంపుల్ ఎవరు అని రాహుల్ అడగగా ఆమె ఎలాంటి ఉదాహరణ చెప్పకపోవడంతో తో ఆమె ఇంకా తన పై కోపం రాహుల్ అర్థం చేసుకున్నాడు రాహుల్. ఇంతకు ముందు జరిగిన ఎపిసోడ్ లో యాంకరింగ్ గురించి రాహుల్ మాట్లాడడంతో శ్రీముఖి హర్ట్ అయిన సంగతి తెలిసిందే.

దీంతో రాహుల్ నిన్నటి ఎపిసోడ్ లో శ్రీముఖి వద్దకు వెళ్లి సారీ చెప్పటం జరిగింది. తాను కావాలని ప్రొఫెషన్ జోలికి వెళ్ళలేదు అని ఈ విషయంలో హర్ట్ అయి ఉంటే తనని క్షమించమని రాహుల్ శ్రీముఖి ని కోరాడు. బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు నుంచి రాహుల్ మంచి స్నేహితుడు కావడంతో చిన్న మాటకు కూడా తను చాలా హర్ట్ అయ్యాను అని చెప్పిన శ్రీముఖి ప్రస్తుతానికి క్షమించినప్పటికీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం ప్రతి వారం తననే నామినేట్ చేస్తానని చెప్పింది. రాహుల్ కూడా దీనికి ఒప్పుకున్నాడు. అయితే ఈవారం ఎలిమినేషన్ లో వీరిద్దరూ ఉన్నారు. మరి ఈ వారం వీరిలో ఎవరైనా ఎలిమినేట్ అవుతారా లేక ఇద్దరూ సేఫ్ అవుతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Loading...