బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవ్వనున్న శిల్ప చక్రబొర్తి

1682
Bigg Boss Telugu Season 3 Week 8 : Wild Card Entry Shilpa Chakravarthy get eliminated?
Bigg Boss Telugu Season 3 Week 8 : Wild Card Entry Shilpa Chakravarthy get eliminated?

బిగ్ బాస్ సీజన్ 3 బోలెడంత డ్రామాతో ఆసక్తికరంగా ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గత వారం అలీ రెజా బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. మళ్లీ వారాంతం రానే వచ్చింది ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈసారి ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారు పునర్నవి భూపాలం, శ్రీముఖి, మహేష్ విట్టా, హిమజా మరియు శిల్ప చక్రబొర్తి. అయితే తాజా సమాచారం ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన చక్రవర్తి ఈ వారం ఇంటి నుంచి వెళ్లి పోతున్నట్లు సమాచారం.

బిగ్ బాస్ మొదలైన రెండవ వారం తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్జెండర్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చారు కానీ రెండు వారాల్లోనే ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అయిపోయారు. తాజాగా ఈ మధ్యనే సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా వచ్చిన శిల్ప చక్రబొర్తి కూడా రెండవ వారమే వెనుతిరుగుతోంది.

ఈమె ఎలిమినేషన్ ఎపిసోడ్ రేపు అనగా ఆదివారం నాడు ప్రసారం కానుంది. మరోవైపు వితిక షేరు బిగ్ బాస్ ఇంటి కొత్త కెప్టెన్ గా నియమితమైంది. కాబట్టి వచ్చే వారం ఈమె నామినేషన్ నుండి తప్పించుకోనుంది. శివ జ్యోతి తరువాత బిగ్ బాస్ ఇంటికి కెప్టెన్ అయిన రెండవ మహిళా కాంటెస్టెంట్ వితిక.

Loading...