Friday, March 29, 2024
- Advertisement -

మొదటి వారం బిగ్ బాస్ నుంచి వెళ్ళి పోయేది ఎవరు?

- Advertisement -

బోలెడు వివాదాల మధ్య తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ మూడవ సీజన్ మొదలైంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మిగతా రెండు సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ మొదలైన రెండు మూడు రోజులకే హౌస్ మేట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇప్పటికే దాదాపు అందరు హౌస్ మేట్స్ ఎవరో ఒక లతో గొడవలు పడ్డారు. అయితే వారాంతం వచ్చేయడంతో ఇంట్లో ఉన్న 15 మంది కంటెస్టెంట్ లలో ఈ వారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది.

టీవీ9 జాఫర్, హేమ, వితిక, పునర్నవి భూపాలం, హిమజా మరియు రాహుల్ సిప్లిగంజ్ ఈసారి నామినేషన్స్ లో ఉన్నారు. ఓటింగ్స్ నిన్నటితో ముగిసిపోయాయి. ఇక ఈ ఆరుగురిలో హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని ఇంకా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే పునర్నవి మరియు జాఫర్ తప్ప మిగతా నలుగురు హౌస్ మేట్స్ లో ఎవరో ఒకరు తో గొడవలు పడ్డారు. కానీ పునర్నవి మరియు జాఫర్ మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎలిమినేషన్ గురించి క్లారిటీ రావాలంటే ఆదివారం రాత్రి వరకు ఎదురుచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -