Saturday, April 20, 2024
- Advertisement -

శ్రీరెడ్డికి దిమ్మతిరిగేలా పంచ్ వేసిన బిత్తిరి సత్తి..!

- Advertisement -

చేవెళ్ళ రవి కుమార్ అని చెబితే ఎవరు గుర్తు పట్టారు కానీ బిత్తిరి సత్తి అంటే వెంటనే ఎవరైన గుర్తుపడుతారు. వార్తలు చెప్పునే స్టేజ్ నుంచి వార్తల్లో నిలిచే స్టేజ్ వరకు వచ్చాడు సత్తి. నిజానికి సత్తి పేరు చాలా మందికి తెలియదు. బిత్తిరి సత్తిగా ఫేమస్ కావడంతో అతని పేరు సత్తి అనే అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు సత్తి తెలియని వారు ఉండరు మన రెండు రాష్ట్రాల్లో. అతని ప్రోగ్రాం వస్తుందంటే చాలు టీవీల ముందు వాలిపోవాల్సిందే.

ఇక తాజాగా సత్తి హీరోగా తుపాకీ రాముడు తెరకెక్కింది. ఇటీవలే ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకున్న ఈ సినిమా.. త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు. తాను సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న టైంలో ఎవరు కూడా తనని పట్టించుకోలేదని.. చాలా మంది ఇష్టానుసారం తిట్టేవారని.. కనీసం ఇక్కడ తినడానికి కూడా ఛాన్స్ లేకపోయిందని బాధపడుతూ సత్తి చెప్పాడు. అందరు నన్ను బాగా వాడుకుని పక్కకు పెట్టేశారు.

దాంతో చాలా ఏడ్చానని చెప్పారు. కాస్టింగ్ కౌచ్ లాగే డ్రింకింగ్ కౌచ్ అని కొత్త ఉద్యమాన్ని చేపట్టేవాడనని వ్యాఖ్యానించారు బిత్తిరి సత్తి. అయితే ఈ పంచ్ ప్రముఖ వివాదల నటి శ్రీరెడ్డికి బాగా సూట్ అవుతుందని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తి చేస్తుండటంతో ఇది వైరల్ గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -