Thursday, April 25, 2024
- Advertisement -

దేవి శ్రీ – సుకుమార్ ప్రాజెక్ట్ లేనట్టేగా?

- Advertisement -

దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం టాప్ లో ఉన్న సంగీత దర్శకుల్లో ఒకడు. హిట్ ఫ్లాప్ కి సంబంధం లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు దేవి. అయితే ఎప్పటి నుండో తన చిరకాల కోరికైన నటుడి అవతారం ఎత్తాలి అన్న దేవి శ్రీ అది తీర్చుకోలేకపోతున్నాడు. సంగీత దర్శకుడిగా బిజీ గా ఉండడం వలన అది తనకి వీలు అవ్వడం లేదు అని పలు మార్లు ఆయన ప్రస్తావించిన సంగతి మనకి తెలిసిందే. అయితే సుకుమార్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణం లో దేవి శ్రీ ప్రసాద్ హీరో గా ప్రాజెక్ట్ కూడా సెట్ అయ్యి ప్రకటించడం కూడా జరిగింది. కానీ ఇప్పటివరకు దాని మీద మళ్లీ అప్డేట్ లేదు.

తాజా గా ఒక ఇంటర్వ్యూ లో దేవి శ్రీ ప్రసాద్ దీని మీద స్పందిస్తూ ఒక స్టేట్మెంట్ చేశాడు. తను సంగీత దర్శకుడిగా బిజీ గా ఉన్నాను అని చాలా మంది దర్శకులు కొత్త స్క్రిప్ట్ తోటి తన వద్దకు వస్తున్నప్పటికీ తన ప్యాషన్ ఎప్పుడు సంగీతం లోనె ఉంటుంది అని కానీ హాలీవుడ్ సినిమా పరిశ్రమ రేంజ్ లో మ్యూజికల్ ప్రాజెక్ట్స్ తరహాలో తెలుగు లో ఎవరైనన తనని అప్రోచ్ అయితే కచ్చితంగా నటుడిగా సినిమాలు చేస్తాను అని తెలిపాడు.

దీని బట్టి చూస్తే సుకుమార్ తో ఉన్న ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడం లేదు అని తెలుస్తుంది. మరి దేవి కి తగ్గట్టు గా ఎవరైనా కథ చేసుకొని వస్తారేమో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -