ప్రతిరోజు పండగే చిత్రానికి అల్లు అర్జున్ అభినందనలు

439
Bunny heaps praises on team Prati Roju Pandage
Bunny heaps praises on team Prati Roju Pandage

‘చిత్రలహరి’ సూపర్ హిట్ తరువాత సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా, హ్యాట్రిక్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీవాస్ నిర్మాతగా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. శుక్రవారం (డిసెంబర్ 20న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ లభించమే కాకుండా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి.

ఇటీవల ప్రతిరోజు పండగే సినిమాపై యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ‘ప్రతిరోజు పండగే సక్సెస్ సాధించడంపై తేజ్, మారుతి, జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌కు మనస్పూర్తిగా అభినందనలు’ అంటూ అల్లు అర్జున్ తెలిపాడు.

కజిన్ సాయి తేజ్ కు మంచి హిట్ కొట్టాడు, నా స్నేహితుడు మారుతి సక్సెస్ అయ్యాడు, బన్నీ వాసు ఖాతాలోకి మరో హిట్ చేరింది, డాడీ అల్లు అరవిండ్ కు ఈ సినిమా ప్రాఫిట్ వెంచర్ అయ్యింది అలాగే నిర్మాణంలో యువి క్రియేషన్స్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా తమన్ మరో సక్సెస్ ఫుల్ ఆల్బమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడని అల్లు అర్జున్ తన ట్విట్టర్ అకౌంట్ లో తెలిపాడు.

Loading...