Thursday, April 25, 2024
- Advertisement -

‘C/o కంచెరపాలెం’ మూవీ రివ్యూ

- Advertisement -

గ‌త కొంత‌కాలంగా తెలుగు ద‌ర్శ‌క-నిర్మాత‌ల ఆలోచ‌న‌ల‌లో చాలా మార్పులు క‌నిప‌స్తున్నాయి.నిజం చెప్ప‌లంటే అర్జున్ రెడ్డి సినిమా త‌రువాత తెలుగు ఇండ‌స్ట్రీలో చాల‌నే మార్పులు చోటు చేసుకున్నాయి. రొటీన్‌ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి రియలిస్టిక్‌గా తెరకెక్కిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో రియలిస్టిక్‌ మూవీ ‘C/o కంచరపాలెం’. వెంకటేష్ మహా దర్శకుడిగా విజయ ప్రవీణా పరుచూరి నిర్మాతగా తెరకెక్కించిన సినిమా C/o కంచెరపాలెం. కంచెరపాలెం అనే గ్రామంలో అక్కడి ప్రజలతోనే తెరకెక్కించారు.హీరో రానా ఈ సినిమాను చూసి తానే స్వ‌యంగా నిర్మాత‌గా వ్య‌వ‌హారించ‌డంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.ఈ రోజు విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ :
ఇది వయసు పరంగా నాలుగు కేటగిరిలో ఉన్న నాలుగు జంటల ప్రేమకథ. సుందరం స్కూల్ పిల్లాడు. తన క్లాస్‌మెట్‌ సునీత అంటే సుందరానికి చాలా ఇష్టం. స్నేహితుడి సాయంతో ఎలాగైన సునీతతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. జోసెఫ్‌ టీనేజ్‌ కుర్రాడు. ఓ జిమ్‌లో పనిచేస్తూ గొడవలు, సెటిల్‌మెంట్స్‌ చేసే జోసెఫ్‌ ఓ గొడవ వల్ల పరిచయం అయిన భువనేశ్వరి అనే బ్రాహ్మణుల అమ్మాయిని ప్రేమిస్తాడు. గడ్డం వైన్‌ షాపులో పనిచేసే కుర్రాడు. తమ షాప్‌లో రోజు మందుకొనే ఓ వేశ్య సలీమాను కళ్లు చూసి ప్రేమిస్తాడు.

రాజు ఓ గవర్నమెంట్‌ ఆఫీసులో అటెండర్‌. 49 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాకపోవటంతో ఊళ్లో అంతా రాజు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. అదే సమయంలో ఒరిస్సా నుంచి ట్రాన్సఫర్‌ మీద తమ ఆఫీసుకు వచ్చిన ఆఫీసర్‌ రాధ తో ప్రేమలో పడతాడు. భర్త చనిపోయి చాలాకాలంగా ఒంటరిగా ఉంటున్న రాధ, రాజును పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇలా కంచరపాలెంలో మొదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాలలో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి.? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి..? చివరకు వారి కథలు ఎలా ముగిసాయి..? అన్నదే కేరాఫ్ కంచరపాలెం కథ.

విశ్లేషణ :
ఓ గ్రామంలోని వ్యక్తులు వారి జీవితాలే కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు వెంకటేష్‌ మహా.. ఎక్కడా సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేయలేదు. సినిమాను పూర్తిగా సహజంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో, ఎలా మాట్లాడతాయో అలాగే తెర మీద ఆవిష్కరించాడు. అదే సమయంలో సమాజంలో ఉన్న అంతరాలు, కులమత భేదాలు వాటి పర్యవసానాలను మనసును తాకేలా చూపించాడు. కమర్షియల్‌ లెక్కల కోసం హాస్య సన్నివేశాలను ఇరికించకుండా.. లీడ్‌ క్యారెక్టర్స్‌ ప్రవర్తన నుంచే కామెడీ పండించి ఆకట్టుకున్నాడు. అందుకే సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కంచరపాలెంలో అక్కడి ప్రజలతో కాసేపు గడిపిన భావన కలుగుతుంది. నాలుగు కథలను ప్యారలల్‌గా నడిపించిన దర్శకుడు క్లైమాక్స్‌ ట్విస్ట్‌తో ఆడియన్స్‌కు షాక్‌ ఇచ్చాడు.

సాంకేతిక వ‌ర్గ ప‌నితీరు:
నిర్మాణ పరంగాను సినిమాకు మంచి మార్కులు పడతాయి. తమకున్న లిమిటేషన్స్ మధ్య అద్భుతమైన అవుట్‌ పుట్‌ ఇవ్వటంలో నిర్మాత కృషి ప్రతీఫ్రేమ్‌లో కనిపిస్తుంది. లైవ్‌ రికార్డింగ్‌ అయినా ఎక్కడ ఆడియో డిస్ట్రబెన్స్‌ లేకుండా క్వాలిటీ సౌండ్‌ను అందించారు. సినిమాకు మరో ఎసెట్‌ వరుణ్‌, ఆదిత్యల సినిమాటోగ్రఫి. కంచరపాలెం వాతావరణాన్ని వ‍్యక్తిత్వాలను అందంగా ఫ్రేముల్లో బందించారు. స్వీకర్‌ అగస్థి సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమా అంతా ఆఫ్‌బీట్‌ తరహాలో సాగటంతో కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

బోట‌మ్ లైన్ : సినిమా క‌థ కాదు నిజం జీవితం గురించి తెలియ‌జేసే వాస్త‌వ రూపం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -