Friday, March 29, 2024
- Advertisement -

ఇదేం ట్రైల‌ర్ సామి!(వీడియో)

- Advertisement -

టాలీవుడ్‌లో ట్రెండ్ మారుతుంది.గ‌త కొంతకాలంగా చిన్న సినిమాలు పెద్ద హిట్లుగా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.అర్జున్ రెడ్డి,ఆర్ఎక్స్ 100.గూడ‌చారి సినిమాలు తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.అదే కొవ‌లోకి వ‌స్తుంది ‘కేరాఫ్ కంచరపాలెం సినిమా. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. వైజాగ్ దగ్గరలో ఉన్న కంచరపాలెం అనే ప్రాంతంలో జరిగే ఓ కథే ఈ సినిమా.49 ఏళ్ల వయసు గల వ్యక్తికి పెళ్లి కాలేదని అతడి గురించి ఊర్లో ఆడవాళ్లంతా తేడాగా మాట్లాడుకుంటున్నారని చాటింపు వేయడంతో ట్రైలర్ మొదలైంది.  ఆ 49 ఏళ్ల వ్యక్తి పాత్రలో నటించిన నటుడు ‘ఊర్లో ప్రతి ఒక్కడు నా పెళ్లి గురించి మాట్లాడుకునేవాడే’ అంటూ తిట్టుకుంటూ వెళ్తుంటాడు.

ఆ వయసులో అతడు ఓ మహిళను ఇష్టపడతాడు. ఆమెను పెళ్లి చేసుకోమని పంచాయితీ పెట్టి మరీ అతడికి క్లాస్ తీసుకుంటుంటారు. మరో కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయితో ‘తొలిసారి వైన్ షాప్ కి వచ్చినప్పుడు చూశా అప్పుడే నిన్ను చూసి పడిపోయా’ అంటూ చెబుతుంటాడు. క‌థ నచ్చ‌డంతో హీరో రానా తానే స్వ‌యంగా ఈ సినిమాను త‌మ నిర్మాణ సంస్థ‌లో నిర్మిస్తున్నారు.సినిమా అంతా సహజత్వంగా ఉండ‌టంతో ట్రైల‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకుట్టుంది.ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 7న విడుద‌ల చేయ‌నున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -