వ్యాధితో బాధపడుతున్న కేథరిన్..!

10180
Catherine tresa worried about new disease
Catherine tresa worried about new disease

కేథరీన్ ట్రెసా టాలీవుడ్ లో, కోలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. అందంకు అందం.. నటనకు నటన ఈమె సొంతం. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున హీరోగా చేసిన సరైనోడు సినిమాలో కేథరిన్ ఒక హీరోయిన్ గా నటించింది. గ్లామర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే సినిమాలు హిట్ అవుతున్నప్పటికి ఈమెకు మాత్రం ఆశించినఫ్త గుర్తింపు రాలేదు. అయితే కోలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ అందుకుంది. అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక తెలుగులో ప్రస్తుతం విజయ్ దేవరకొంద నటిస్తున్న ’వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. కేథరీన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. ఈ వ్యాధి వల్ల చాలా సమస్యలు ఎదురుకుంటుందట. అనోస్మియ అనే ఈ జబ్బు వల్ల కేథరీన్ చాలా ఇబ్బంది పడుతుందట. అయితే ఈ జబ్బు ఉన్న వారు వాసన చూడలేరు. సువాసన అయినా.. దుర్వాసన అయినా వీరికి తెలియదు.

వాసన చూసే శక్తి వారు కోలిపోతారు. ఈ వ్యాధి వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పెళ్లి చేసుకోకుండా ఉండాలని భావిస్తుందట. ఈ జబ్బు లక్షల్లో ఒకరికి వస్తుందట. ఇప్పుడు ఇది కేథరిన్ కు రావడం వల్ల ఆమె ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యాధి వల్ల తన నటనకు ఎలాంటి అడ్డు లేదని కేథరీన్ చెప్పుకొచ్చింది.

Loading...