చంద్ర‌బాబుకు షాక్‌.. ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎలెక్ష‌న్ క‌మిష‌న్‌

294
Censor green signal to lakshmi's ntr
Censor green signal to lakshmi's ntr

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబుకు వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే పార్టీ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతున్నారు. తాజాగా చంద్ర‌బాబుకు మ‌రో షాక్ త‌గిలింది. టాలీవుడ్ వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ చివ‌రి రోజుల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ముఖ్యంగా ఎన్టీఆర్ రెండో భార్య ఆయ‌న జీవితంలోకి వ‌చ్చిన దగ్గర నుంచి ఈ సినిమా తీశాడు వ‌ర్మ‌.

ఈ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబును విల‌న్‌గా చూపించ‌బోతున్నాడు వ‌ర్మ‌. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ట్రైల‌ర్, వీడియో సాంగ్స్‌లో చంద్ర‌బాబును టార్గెట్ చేసిన‌ట్లుగా చూపించారు. ఎన్టీఆర్ చివ‌రి రోజుల్లో వెన్నుపోటు ఎలా పొడిచారో చూపిస్తానంటున్నాడు రామ్ గో పాల్ వ‌ర్మ‌. అయితే ఈ సినిమాలో చంద్ర‌బాబును చెడుగా చూపించార‌ని,ఎన్నిక‌ల స‌మయంలో విడుద‌ల అవుతున్న ఈ సినిమా ఓట‌ర్ల‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ నాయ‌కులు సినిమాను ఆపేయాల‌ని సెన్సార్‌కు ఫిర్యాదు చేశారు.

అయితే చంద్ర‌బాబుకు షాకిస్తు సినిమా విడుద‌ల తేదీని ఎన్నిక‌ల షెడ్యూల్ క‌న్నా ముందే అనౌన్స్ చేశార‌ని , ఇలా ఓ వ్య‌క్తి కోసం సినిమాను విడుద‌ల కాకుండా అడ్డుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని తేల్చి చెప్పింది ఎలెక్ష‌న్ క‌మిష‌న్‌. దీంతో ఈ సినిమా ఈ నెల 22న విడుద‌ల కావ‌డం ప‌క్కా అని తెలిపోయింది.