Tuesday, April 23, 2024
- Advertisement -

తన సినిమాని తానే కాపీ కొట్టాడు త్రివిక్రమ్ అన్న టాక్ రాకపోతే హిట్ బొమ్మే

- Advertisement -

అజ్ఙాతవాసితో త్రివిక్రమ్ సరుకు అయిపోయింది అన్నవాళ్ళకు ఆ వెంటనే సమాధానం ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న లై సినిమా రిజల్ట్ నితిన్‌ని తీవ్రంగా నిరాశపర్చింది. అ..ఆ..లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆ ఫాం కంటిన్యూ చేద్దామనుకుంటే లై సినిమా దెబ్బేసింది. అయితేనేం ఇప్పుడు మరోసారి అ…ఆ..సినమా మేజిక్‌ని రిపీట్ చేయబోతున్నాడు.

అ…ఆ….సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ జాగ్రత్తగా చల్ మోహన్ రంగా సినిమాలో యాడ్ చేశారు. ఈ సినిమా కథా రచయిత కం ప్రొడ్యూసర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ యాజ్ ఇట్ ఈజ్‌గా అ….ఆ.. సినిమా ఫ్లేవర్‌ని దింపేశాడు. బ్యాక్ డ్రాప్ మాత్రం ఫారెన్‌కి మార్చారు. డైలాగ్స్ మాత్రం అ…ఆ…సినిమా శైలిలోనే ఉన్నాయి. త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తోంది. ఇక టెక్నికల్‌గా కూడా సినిమా చాలా బాగుంది. థమన్ మ్యూజిక్ బాగుంది. కృష్ణ చైతన్య డైరెక్షన్ ఒకే. లై సినిమాతోనే మంచి పెయిర్ అనిపించిన నితిన్, మేఘా ఆకాష్‌లు ఈ సినిమా ట్రైలర్‌లో బెస్ట్ పెయిర్ అనేలా అనిపించారు. ఇద్దరి మధ్య సీన్స్ చాలా బాగున్నాయి. నితిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మొత్తంగా చూస్తే అ…ఆ…సినిమా స్థాయి కంటెంట్‌ అయితే చల్ మోహన రంగాలో కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ నిర్మాత కావడం……ట్రైలర్‌లోనే పవన్‌ని వాడుకున్న నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ సపోర్ట్‌తో ఓపెనింగ్స్‌కి ఢోకా ఉండకపోవచ్చు. ఈ సినిమాలో పవన్, త్రివిక్రమ్‌ల పెట్టుబడులు లేవు కానీ వాళ్ళ పేర్లు వాడుకున్నందుకు మాత్రం బ్రాండింగ్ షేర్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఫైనల్‌గా చూస్తే……సినిమాలో మినిమం ఎంటర్టైన్‌మెంట్ ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్‌గా నిలబడడం ఖాయంగా కనిపిస్తోంది. కాకపోతే మరీ అ..ఆ..సినిమాకు కాపీలా అనిపించే ప్రమాదం అయితే ట్రైలర్‌లో కనిపిస్తోంది. ఆ ఒక్క ప్రాబ్లం లేకపోతే మాత్రం చల్ మోహన్ రంగా హిట్ ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -