Friday, April 19, 2024
- Advertisement -

జబర్దస్త్ లో నాకే ఎక్కువ రెమ్యునరేషన్ : చమ్మక్ చంద్ర

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో ద్వారా చమ్మక్ చంద్రకు విపరితమైన క్రేజ్ వచ్చింది. ఈ షో ద్వారా చాలా మంది కమెడీయన్స్ వచ్చినప్పటికి చమ్మక్ చంద్ర మాత్రం తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ షోలో చంద్ర స్కిట్ కోసం చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు.

అలాంటి చమ్మక్ చంద్ర తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ” సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ, ఏ సినిమాకి ఎన్ని రోజుల వర్క్ ఉంటుందో చెప్పలేము. అలాగే ఏ సినిమాకి ఎంత ఇస్తారో కూడా చెప్పలేము. అదే ‘జబర్దస్త్’ షో నుంచి అయితే ప్రతి నెలా మాకు ఒక ఫిక్సెడ్ అమౌంట్ వస్తుంది .. అదే మా ధైర్యం. ‘జబర్దస్త్’లో వున్న అన్ని టీమ్స్ కంటే నా టీమ్ కే పారితోషికం ఎక్కువ. అంటే నేను తీసుకునే పారితోషికమే ఎక్కువ.

నా టీమ్ లో సభ్యులు ఎక్కువమంది వుంటారు. అలా నా స్కిట్ లను నేను ప్లాన్ చేసుకుంటాను. నాతో పాటు స్టేజ్ పై మిగతా వాళ్లు కనిపించినప్పటికీ, వాళ్ల పాత్రల ప్రాధాన్యతను బట్టి పారితోషికాన్ని పంచుతాను” అని చంద్ర చెప్పుకొచ్చాడు. అయితే చంద్ర ఇప్పుడు జబర్దస్త్ నుంచి జీతెలుగులో వస్తున్న అదిరింది షోకి వెళ్లిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -