Thursday, March 28, 2024
- Advertisement -

మొద‌టిసారి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ గురించి స్పందించిన‌ చంద్ర‌బాబు

- Advertisement -

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన సినిమా. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి జీవితంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించాడు వ‌ర్మ‌. అయితే ఈ సినిమాపై మొద‌టి నుంచి ఏపీ సీఎం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా తెర‌కెక్కుతుంద‌ని టీడీపీ పార్టీ ఆరోపిస్తు వ‌స్తోంది.

దీనికి త‌గిన‌ట్లుగానే వ‌ర్మ త‌న ట్రైల‌ర్‌, టీజ‌ర్‌లో చంద్ర‌బాబును నెగిటివ్‌గానే చూపించాడు. పైగా ఈ సినిమాను ఎన్నిక‌ల స‌మ‌యంలోనే విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యాడు వ‌ర్మ‌. దీంతో ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఏపీలో విడుద‌ల కాకుండా అడ్డుకోవాల‌ని టీడీపీ పార్టీ య‌త్నించింది. సినిమాను ఏపీలో విడుద‌ల కాకుండా చూడట‌లంలో విజ‌యం సాధించింది కూడా. అయితే ఇప్పుడు ఎన్నిక‌లు పూర్తి కావ‌డంతో సినిమాను ఏపీలో విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యాడు వ‌ర్మ . దీనిపై కూడా అభ్యంత‌రాలు చెప్పింది ఎన్నిక‌ల క‌మిష‌న్‌.

దీనిపై తీవ్రంగా స్పందించాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. మ‌నం ఇండియాలోనే ఉంటున్నామా అనే అనుమానం క‌లుగుతుంది అంటూ ట్విట్ట‌ర్‌లో ఏపీ గ‌వ‌ర్న‌మెంట్‌పై రెచ్చిపోయాడు. తాజాగా దీనిపై ఏపీ సీఎం చంద్ర‌బాబు స్పందించారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై తొలిసారి స్పందించారు. ఈ సినిమాతో నన్ను ఏమో చేయాలనుకున్నారు.. కానీ నాకే మాత్రం ఆందోళన లేదు అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆమె(ల‌క్ష్మీ పార్వ‌తి) ఏ పార్టీలో ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు అని.. ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. అయితే ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు డైరెక్ట్‌గా ల‌క్ష్మీ పార్వ‌తి పేరు ఎక్క‌డ కూడా ప్ర‌స్తావించ‌లేదు. విజ‌య‌వాడ‌లో ఏం చేయ‌లేడు అంటూ వ‌ర్మను హెచ్చ‌రించాడు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను తాను అడ్డుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -