చార్మి ట్వీట్ వల్ల మూతపడబోతున్న థియేటర్

195
Charmy Kaur Twitter Effect Theater Licence Will Cancel..?
Charmy Kaur Twitter Effect Theater Licence Will Cancel..?

రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్లు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఛార్మి కౌర్ తాజాగా షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా థియేటర్ లో ప్రేక్షకులు ఎక్స్ట్రా చైర్లు తీసుకెళుతూ ఉన్న వీడియో ని చాలా ఆనందంగా షేర్ చేసింది ఛార్మి. సినిమాని ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు అని చెప్పడం చార్మి ఉద్దేశ్యం కాబోలు అయితే అది ఇప్పుడు అది కాస్తా ఇప్పుడు బెడిసికొట్టింది.

నిజానికి అలా థియేటర్లలో మన ఇష్టం వచ్చినట్టు ఎక్స్ట్రా కుర్చీలు తీసుకుని వెళ్లి సినిమా చూడటం చట్ట విరుద్ధం. ప్రేక్షకులు ఇలాంటివి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన ఒక యాక్టివిస్ట్ మాత్రం దీనిపై గొంతెత్తారు. “వీడియో చూస్తుంటే ఇది వెంకటేశ్వర టాకీస్ థియేటర్ లాగా అనిపిస్తుంది. థియేటర్ ఎక్కడుందో చెప్పగలరా? థియేటర్ నడిపిస్తున్న వారి లైసెన్స్ ని క్యాన్సిల్ చెయ్యాలి” అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయగా నెటిజన్లు అది తెలంగాణలోని కొల్లాపూర్ లో ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఛార్మి ట్వీట్ వల్ల ఇప్పుడు ఆ థియేటర్ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

Loading...