మరో టీజ‌ర్‌ను వ‌దిలిన బూతు సినిమా

259
Chikati Gadilo Chithakotudu Teaser
Chikati Gadilo Chithakotudu Teaser

తెలుగు ఇండ‌స్ట్రీలో బూతు సినిమాలు సినిమాలు ఎక్కువుగా వ‌స్తున్నాయి అని ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న మాటే. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాల త‌రువాత అడ‌ల్డ్ సినిమాల హ‌వా మ‌రింత ఎక్కువైంది. ఏదో ర‌కంగా బూతు సినిమాల‌ను తీసేసి వాటిని యూత్ మీద‌కు వ‌దులుతున్నారు. ఏడు చేపల కథ ,చీకటి గదిలో చితక్కొట్టుడు ,90ఎంఎంల్ వంటి సినిమాలు తెలుగు తెర మీద‌కు దాడి చేయ‌డానికి రెడీ అయ్యాయి.

ఈ మూడు సినిమాలు కూడా త‌మ టీజ‌ర్‌ల‌తోనే అంద‌రి దృష్టి త‌మ సినిమాల‌పై ప‌డేలా చేశారు. తాజాగా చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా నుంచి మ‌రో టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. గ‌తంలో విడుద‌ల చేసిన టీజ‌ర్‌లోనే డ‌బ‌ల్ మీనింగ్ డైలాగులు చాలానే ఉన్నాయి. రెండో టీజ‌ర్‌లోను దీనిని కొన‌సాగించారు. ఈ టీజర్‌లో ఫక్తు బూతు ద్వంద్వార్థ డైలాగులతో వల్గారిటీ షాక్ కి గురి చేస్తోంది. ఇలా బూతును న‌మ్మ‌కున్న ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి. బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద సినిమాలు ఏవి లేక‌పోవ‌డంతో ఈ సినిమాను త్వ‌ర‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.