Friday, March 29, 2024
- Advertisement -

బన్నీని నేను నమ్మను.. చిరు షాకింగ్ కామెంట్స్

- Advertisement -

ఏ సినిమా పరిశ్రమలో అయినా.. ఎంత పెద్ద హీరో అయినా.. తమ సినిమా రిలీజ్ అవుతుందంటే టెన్షన్ పడుతారు. సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని నిద్ర కూడా సరిగ్గా పోరు. అలాంటి పరిస్థితినే మెగాస్టార్ చిరంజీవికి ఎదురైంది. సైరా రిలీజ్ రోజున తాను ఎంతో టెన్షన్ పడ్డాడని ఇటీవలే ప్రమోషన్ లో భాగంగా చెప్పుకొచ్చారు. నా ఏ సినిమా రిలీజ్ అయినా ఆ రోజు ఉదయం 4 గంటలకే ఫోన్స్ వస్తాయని.. కానీ సైరా రిలీజ్ రోజు ఒక్క కాల్ కూడా రాలేదు.

దాంతో కంగారు పడిపోయాను. కొద్దిసేపటికి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కాల్ చేసి.. ఫస్ట్ ఆఫ్ చూశాను.. అద్భుతంగా ఉందని చెప్పాడు. సెకండాఫ్ చూసి చెబుతాను అన్నాడు. కానీ మళ్లీ కాల్ చేయలేదు. అమెరికా, కెనాడా నుంచి నా స్నేహితులు చేస్తారు. కానీ వాళ్లు కూడా చేయలేదు. సీడెడ్ నుంచి ఎన్వీ ప్రసాద్ చేస్తారు. అతను కూడా చేయకపోయేసరి సెకండాఫ్ ఎవరికి నచ్చలేదా అని కాస్త అనుమానం వచ్చింది. దాంతో టెన్షన్ కలిగింది. అప్పుడు అల్లు అర్జున్ వాయిస్ మెసేజ్ వచ్చింది.

కృష్ణా జిల్లాలో నిర్మాత బన్నీ వాసు సినిమా చూశాడు. బ్లాక్ బస్టర్ రిపోర్టు.. అంటూ బన్నీ చెప్పాడు. కానీ బన్నీ మాటలు నేను నమ్మలేదు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్లు మన సినిమా బాగుందని చెప్పడం సహజం. అందుకే బన్నీ మాటలు నమ్మలేదు. సుమారు 5 గంటలకు చాలా కాల్స్, మెసేజ్ లు వచ్చాయి. నా ఫ్రెండ్ అప్పుడే అమెరికా నుంచి కాల్ చేశాడు.

ఇంత లేటుగా ఫోన్ చేశావు ఏంటని అడిగితే.. ఫస్ట్ షోకి టికెట్ దొరకలేదని షోలు హౌస్ ఫుల్ అయ్యాయని అందుకే రెండో షో చూశానని చెప్పాడు. అలా గంట గడిచాక బ్లాక్ బస్టర్ రిపోర్ట్ ను నమ్మాను. అప్పుడు నా మనసు తెలికపడిందని చిరు చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -