Friday, March 29, 2024
- Advertisement -

శ్రీరెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్..?

- Advertisement -

నటి శ్రీరెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. దాంతో చిరు, శ్రీరెడ్డి ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఇటివలే ముగిసిన బిగ్ బాస్ మూడో సీజన్ ఫైనల్ కు గెస్ట్ గా చిరు వచ్చారు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. విషయంలోకి వెళ్తే… బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తో వరసగా మాట్లాడారు చిరు.

అక్కడే ఉన్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి గురించి చిరు మాట్లాడుతూ.. ఓ సమస్య వస్తే స్నేహాన్ని కూడా పక్కనబెట్టి నువ్వు ఎంత నిబద్దతతో వ్యవహరిస్తావో నాకు తెలుసు అన్నారు. ఇదే ఇప్పుడు చర్చకు దారి తీసింది. సమస్య ఏదైన ధైర్యంగా ఎదుర్కొంటావు అంటూ తమన్నా ను చిరు పొగిడారు. పోరాటంలో తన స్నేహితుల తప్పు ఉందన్న విషయం తెలిస్తే వారిని కూడా వదిలిపెట్టని డేరింగ్ పర్సనాలిటీ తమన్నా అని చిరు అన్నారు.

ఏం జరిగిందో నీకూ నాకూ మాత్రమే తెలుసు, ఐ అప్రిషియేట్ యూ అంటూ తమన్నాపై కామెంట్ చేశారు చిరంజీవి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో నీకు నాకు మాత్రమే తెలుసు అంటూ చిరు గంభీర స్వరంతో మాట్లాడటం చూసి తమన్నా భావోద్వేగానికి లోనైంది. దీంతో ఇదంతా చూసి.. తమన్నాను అడ్డుపెట్టుకుని ఇన్ డైరెక్ట్ గా శ్రీరెడ్డి పేరు పెట్టాకుండా సెటైట్లు వేస్తున్నారు చిరంజీవి అని టాక్ బయటకు వచ్చేసింది.

గతంలో శ్రీ రెడ్డి అసభ్యకర మాటలు మాట్లాడుతున్నపుడు ఆమెకు వ్యతిరేకంగా తమన్నా కామెంట్స్ చేసింది. ఆ సందర్భం మీదే ఇప్పుడు తమన్నాను అభినందిస్తూ.. శ్రీ రెడ్డిపై మెగాస్టార్ సెటైర్లు వేశారని వార్తలు వస్తున్నాయి. మరి ఇలా పరోక్షంగా వ్యాఖ్యలు శ్రీరెడ్డిపై చిరంజీవి చేశాడని వస్తున్న క్రమంలో శ్రీరెడ్డి ఎలాంటి రచ్చ చేస్తుందో అని అందరు అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -