వార్ కి ఎదురెళ్లనున్న మెగాస్టార్

338
Chiranjeevi Sye Raa Narasimha Reddy clashing with Hrithik Roshan War on October 2
Chiranjeevi Sye Raa Narasimha Reddy clashing with Hrithik Roshan War on October 2

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో లో భారీ అంచనాల మధ్య త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా. ఈ సినిమా ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియన్ సినిమా కాబట్టి ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాక ఇటు సౌత్ మరియు హిందీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. కానీ అనుకోకుండా హిందీలో హృతిక్ రోషన్ మరియు టైగర్ శ్రోఫ్ హీరోలుగా నటించిన ‘వార్’ సినిమా నుంచి పోటీ ఎదురుకానుంది.

నిజానికి ఈ మధ్యనే ‘తగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా డిజాస్టర్ అవడంతో ‘వార్’ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను తగ్గించుకోమని డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత ని కోరుతున్నారు. కానీ ఆదిత్యచోప్రా మాత్రం చిత్రం థియేట్రికల్ రైట్స్ విషయంలో ఏమాత్రం తగ్గడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ సినిమా విడుదల తేదీ పై కొంత సందిగ్ధత నడుస్తుంది. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా కూడా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమా నుంచి ‘సై రా’ కి గట్టి పోటీ ఎదురు కాబోతోంది. అయితే థియేటర్ల విషయంలో మాత్రం ఈ రెండు సినిమాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. ఇప్పటికే హిందీలో ‘సై రా’ సినిమాని విడుదల చేస్తున్న నిర్మాతలు ఐదు వేల థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Loading...