Friday, March 29, 2024
- Advertisement -

వరల్డ్ కప్ ఫైనల్ కోసం వేచి చూస్తున్న చిరంజీవి

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రానున్న చిత్రం సై రా నరసింహ రెడ్డి. ఈ సినిమా ఇప్పటికే ఎంతో బజ్ ని క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇక ఈ సినిమా మీద ప్రస్తుతం పలు వివాదాలు కూడా ఉన్నాయి. చిత్ర యూనిట్ మాత్రం అన్నిటినీ పక్కన పెట్టి నిర్మాణాంతర కార్యక్రమాల తో బిజీ గా గడుపుతున్నారు. ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ అంతా పూర్తయింది. అలాగే డబ్బింగ్ కూడా దాదాపు గా చివరి దశ కి చేరుకుంది. ఇక ప్రమోషన్స్ మొదలు పెట్టి మెల్లగా సినిమా ని జనాల్లోకి తీసుకొని వెళ్ళాలి అనేది చిత్ర యూనిట్ ముందున్న ప్లాన్.

కాకపోతే ప్రస్తుతం వరల్డ్ కప్ సీజన్ నడుస్తున్న కారణం గా చిత్ర యూనిట్ సైలెంట్ గా ఉన్నారట. ప్రస్తుతం జనాలు అందరూ వరల్డ్ కప్ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడప్పుడే ప్రమోషన్స్ చేసినా వరల్డ్ కప్ ఫీవర్ లో బజ్ డైవర్ట్ అయిపోతుంది అనే అంచనా తో చిత్ర యూనిట్ వరల్డ్ కప్ అయ్యే వరకు ఆగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అక్టోబర్ లో విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -