Tuesday, April 23, 2024
- Advertisement -

మోహన్ బాబుకి ముద్దుపెట్టిన చిరంజీవి ( వీడియో )

- Advertisement -

ఈ రోజు హైదరాబాద్లో మా అసోసియేషన్ డైరీ రీలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, కృష్ణంరాజు గారి తో పాటు ఇతర నటీ నటులు కొంత మంది హాజరయ్యారు. ఈ వేడుకలో ఓ చక్కని సన్నివేశం చోటుచేసుకుంది. ఎప్పటి నుంచో మోహన్ బాబు చిరంజీవి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే ఇప్పటికే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని మోహన్ బాబు, చిరు స్పష్టం చేశారు. ఇక ఈరోజు జరిగిన మా డైరెక్టర్ ఈవెంట్ లో మోహన్ బాబు చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ తనకు చిరంజీవి స్నేహం ఉందని ఆయన భార్య తనకు సోదరని.. ఎప్పుడు ఇంటికి వెళ్లిన చాలా మంచిగా రీసివ్ చేసుకుంటారని మోహన్ బాబు చెబుతూ ఉండగా చిరంజీవి లేచి మోహన్ బాబు గారిని ఆత్మీయంగా కౌగిలించుకొని ముద్దు పెట్టారు.

అక్కడున్న ప్రాంగణం అంతా ఒక్కసారిగా కేరింతలు అరుపులతో మారుమోగిపోయింది. ఇందుకు సంబంధించిన చిరు, మోహన్ బాబు గారికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సన్నివేశం తో వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్నేహం ఉందని క్లారిటీ అందరికీ వచ్చేసింది. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడమే కాకుండా బయట కూడా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -