సైరా టీజర్ పై అల్లు కుటుంబం మౌనం

711
Cold War within the Mega Family
Cold War within the Mega Family

మెగా కుటుంబానికి మరియు అల్లు కుటుంబానికి మధ్య ఏదో తగాదా నడుస్తుందని ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ విషయంపై రియాక్ట్ అవుతూ ఇరువర్గాలు చాలా సందర్భాల్లో ఆ పుకార్లను కొట్టిపారేశారు. కానీ అల్లు బ్రదర్స్ ప్రవర్తన మళ్లీ ఈ పుకార్లకు తావిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదలైంది. ఈ చిత్రం టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా టీజర్ కు మెగా అభిమానులు మాత్రమే కాకుండా మెగా కుటుంబం లోని కొందరు ప్రముఖులు కూడా రియాక్ట్ అయ్యారు.

టీజర్ అదిరిపోయింది అంటూ ఇప్పటికే చాలామంది పోస్టులు పెట్టారు కానీ అల్లు కుటుంబం నుంచి మాత్రం ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబి, ఆఖరికి స్నేహ రెడ్డి కూడా ఈ చిత్ర టీజర్ పై సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ మరియు మెగా కుటుంబానికి మధ్య ఏదైనా నడుస్తోందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్ కూడా చిత్ర టీజర్ పై తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ అల్లు బ్రదర్స్ మౌనం మాత్రం అందరినీ కన్ఫ్యూజన్లో కి నెట్టేస్తోంది.

Loading...