చనిపోతే మృతదేహాలను తీయడానికి కూడా రారు : అలీ

2953
comedian ali emotional coronavirus
comedian ali emotional coronavirus

కరోనా వైరస్ రాకుండా ఉండాలని.. ఇంట్లోనే పదిరోజులుగా ఉంటూ నమాజ్ చేస్తున్నట్లు కమెడియన్ అలీ అన్నారు. చాలా మంది తిండి లేక, డబ్బు ల్లేక బాధపడుతుంటారు. కాని తప్పదు. ఈ వ్యాధి అలాంటిది. ఇటలీలో ఈ వ్యాధి వల్ల చనిపోయిన వారి మృతదేహాలను తీయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వాలకు, పోలీసులకు సహకరించాలి అని అలీ అన్నారు.

కరోనా కట్టడి సహాయం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లక్ష రూపాయలు, తెలంగాణ ప్రభుత్వానికి లక్ష రూపాయలు సాయం ప్రకటించారు. ‘‘భారతదేశంలో చాలా మంది గొప్పోళ్లు ఉన్నారు.. ఈ సమయంలో వారు కూడా సాయం చేస్తే చాలా మంచిది.. ఈ వైరస్‌పై ఎవరూ కామెంట్స్‌ చేయొద్దు.. కామెడీ చేయొద్దు. ఈ సమయంలో చాలా మంది రేట్లు పెంచి డబ్బు సంపాదించేద్దాం అనుకుంటున్నారు.. ఇది సంపాదించే సమయం కాదు.. మానవత్వం చూపాల్సిన సమయమిది. ఎంత రేటు ఉంటే అంతకే అమ్మండి’’ అన్నారు అలీ.

ఇలా అలీ సహ కొందరు సాయం చేస్తూ.. ప్రజలకు కరోనా వల్ల వచ్చే ప్రమాదం గురించి చెబుతూ ప్రజలను ఇంట్లోనే ఉండాలని కోరుతున్నారు. కానీ అనసూయ లాంటి వారు తాము ఇంట్లో ఉండలేమని.. ఇంటి అద్దె, ఈఎమ్‍ఐ కట్టుకోవాలని తమ పనులు చేసుకునేలా చూడలని అనసూయ ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో అనసూయపై నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. బయటకు వెళ్తే ప్రమాదం అని తెలిసి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావని ఫైర్ అవుతున్నారు.

Loading...