పవన్ కళ్యాణ్ నుంచి ఈ సారి మామిడి పండ్లు రాలేదు : ఆలీ

975
Comedian Ali Interesting Comments On Pawan Kalyan
Comedian Ali Interesting Comments On Pawan Kalyan

ఇటీవలే ఓ చానెల్ తో టాలీవుడ్ కమెడియన్ ఆలీ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తో పరిచయం.. ఆయనతో ఫ్రెండ్ షిప్ వంటి విషయాల గురించి చెప్పారు. ఆలీ మాట్లాడుతూ..”నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు. ’అన్నయ్య ఇప్పుడే వచ్చారు. మీరు కూర్చోండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా’ అని సరదాగా కబుర్లు మాట్లాడేవారు. ఏం సినిమాలు చేస్తున్నారని అడిగేవారు. ఆ తర్వాత ఆయన ’అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ సినిమా చేశారు. ఆ సినిమా తప్ప మిగితా అన్ని సినిమాల్లో నేను నటించాను.

‘అజ్ఞాతవాసి’లో కూడా నేను నటించలేదు. ఆయన హీరోగా చేసిన 25 సినిమాల్లో 23 సినిమాల్లో నేను నటించాను. మొదట ‘గోకులంలో సీత’, తరవాత ‘సుస్వాగతం’, తరవాత ‘తొలిప్రేమ’ సినిమాలో నటించాను. ‘తొలిప్రేమ’ సినిమా నుంచి మా జర్నీ బలపడింది. పవన్ కళ్యాణ్ గారితో ఆఖరిగా చేసిన సినిమా కాటమరాయుడు’’ అని ఆలీ చెప్పుకొచ్చారు. అయితే ఆలీ కనిపిస్తే పవన్ కళ్యాణ్ నవ్వడం మొదలు పెడుతారు. దీని గురించి ఆలీ మాట్లాడుతూ..”మేం కొన్ని సైగలు చేసుకుంటూ ఉంటాం. అవి మా ఇద్దరికీ తప్ప ఎవరికీ తెలీవు. నావి కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. అలాగే, బ్రహ్మానందం గారన్నా ఆయనకు చాలా ఇష్టం. చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మానందం గారు చాలా దగ్గర. మెగా ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్ చేస్తే ఆహ్వానించే కొంత మంది పేర్లలో బ్రహ్మానందం గారి పేరు, నా పేరు కచ్చితంగా ఉంటాయి’’ అని ఆలీ వెల్లడించారు.

ప్రతి ఇయర్ చిరంజీవి గారి ఇంటి నుంచి తనకు ఆవకాయ పచ్చడి వస్తుందని ఆలీ అన్నారు. పెద్ద జాడీతో ఆవకాయ పచ్చడి పంపుతారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా సేంద్రియ మామిడి పండ్లు పంపేవారని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలతో పవన్ బాగా బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం మామిడి పండ్లు రాలేదని.. బహుశా వచ్చే ఏడాది రావచ్చేమోనని ఆలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వైసీపీలో చేరిన తరవాత తన రాజకీయాల గురించి ఆలీ మాట్లాడుతూ.. ‘‘మూడు నెలల నుంచి మా ఇంట్లో పాలిటిక్స్‌తో సరిపోతోంది. పిల్లలకి నాకు.. నాకు, మా ఆవిడకి రాజకీయాలు జరుగుతున్నాయి. కోవిడ్ అయిన తరవాత వెళ్లి కలుస్తా’’ అని ఆలీ చెప్పారు.

Loading...