Friday, March 29, 2024
- Advertisement -

సోషల్ మీడియా లో వైరల్ గా మారిన పవన్ కళ్యాణ్ కామన్ డీపీ

- Advertisement -

ఈ సంవత్సరం సెప్టెంబర్ 2 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 48వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకొనున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు అందరూ ఆ రోజున ఒక కామన్ డీపీ తో సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపనున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. బద్రి సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పోస్టర్ ఇప్పుడు మెగా అభిమానులకి కామన్ డిపి గా మారనుంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతుంది.

ఏపీ వరద బాధితులకు మద్దతిద్దాం అంటూ చెర్రీ ఈ ఫోటో ని విడుదల చేసారు. మెగా మెగా అభిమానులందరూ ఇప్పటికే ఆ ఫోటో ని తమ డిపి గా సెట్ చేసుకుంటున్నారు. మెగా అభిమానులు అందరూ ఇప్పుడు ఈ ఫోటోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఓవైపు సినిమాల పరంగా చూస్తే రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండగా మరోవైపు సినిమాలకు గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ పై దృష్టి పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -