Friday, April 26, 2024
- Advertisement -

హాట్ హాట్ సాంగ్ తో వరుణ్ తేజ్ జల్సా

- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం లో వాల్మీకి అనే ఒక సినిమా కి పని చేస్తున్నాడు. తమిళం లో జిగర్తాండ అనే సినిమా కి ఇది రీమేక్. బాబీ సింహా తమిళం లో పోషించిన పాత్ర ని పెంచి దానిని హీరో పాత్ర స్థాయి కి మరల్చి వరుణ్ చేత చేయిస్తున్నాడు హరీష్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగం గా జరుగుతుంది. అయితే ఈ సినిమా లో ప్రస్తుతం ఒక హాట్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారట.

మిక్కి జె మేయర్ అందించిన ఒక మంచి బాణీ కి భాస్కరభట్ల రవికుమార్ రాసిన సాహిత్యానికి హరీష్ శంకర్ ముగ్ధుడైపోయారు. అందుకే ఆ పాట కి సంబందించిన సాహిత్యాన్ని ఆయన ట్విట్టర్ లో పెట్టారు. “సిగ్గుకీ అగ్గెట్టేయ్.. బుగ్గకి ముద్దెట్టేయ్.. గలగలలాడే గలాసుతోటి.. కులాసాలెన్నో లెగ్గొట్టేయ్.”అనే పాట ప్రస్తుతం చిత్రీకరణ దశ లో ఉంది. అయితే ఈ సినిమా మీద వాల్మీకి కులానికి సంబందించిన కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేయగా, “వాల్మీకి పూజించిన రాముడు కూడా ధర్మం కోసమే ఫైట్ చేసాడు. ఏది ఏమైనా మేము వాల్మీకి కమ్యూనిటీ కి సంబందించిన వారికి గౌరవం ఇచ్చి వారు చెప్పే విషయాలని కూడా పరిగణం లోకి తీసుకుంటాము.” అని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.

ఇంతకు ముందు తను చేసిన దువ్వాడ జగన్నాథం అనే సినిమా కి బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -