Tuesday, April 23, 2024
- Advertisement -

సమంత కోసం బాబాయ్-అబ్బాయ్

- Advertisement -

సమంత అక్కినేని ప్రధాన పాత్ర లో త్వరలో తెలుగు లో రానున్న చిత్రం ఓ బేబీ. ఈ సినిమా లో సమంత ఒక విభిన్న పాత్ర లో కనిపించనుంది. ఇంతకు ముందు కొరియా భాషలో వచ్చిన మిస్ గ్రానీ అనే సినిమా కి ఇది తెలుగు రీమేక్. సునీత తాటి, సురేష్ బాబు, విశ్వా ప్రసాద్ కలిసి ఒక కొరియన్ నిర్మాణ సంస్థ తో కలిసి ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. నందిని రెడ్డి ఈ సినిమా కి దర్శకురాలు. ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ దశ లో ఉంది. గత నెల రోజుల నుండి ఈ చిత్ర యూనిట్ ఫుల్ గా ప్రమోషన్స్ మీద కాన్సెన్ట్రేట్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నారు.

అయితే ఈ సినిమా అంతా సమంత చుట్టూ నే తిరుగుతుంది. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఈ సినిమా సమంత కి ఒక సోలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా. అయితే ఈ సినిమా యూనిట్ కి అభినందనలు తెలియజేయడానికి, అక్కినేని కోడలు సమంత ని విష్ చేయడానికి ఈ రోజు జరిగే ఈవెంట్ కి దగ్గుబాటి ప్రముఖులు, బాబాయ్-అబ్బాయిలు వెంకటేష్ మరియు రానా కలిసి వస్తున్నారు. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం తో ఈ ఈవెంట్ పై ఆసక్తి మరింత పెరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -