Friday, April 19, 2024
- Advertisement -

రానా అరణ్య పెద్ద స్క్రీన్ లోనే..

- Advertisement -

బాహుబలి సినిమా తో దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన పేరు రానా దగ్గుబాటి.. ఈ సినిమా తో తన స్టామినా తెలియజేయడమే కాదు హీరో గా కూడా నిలదొక్కుకోవడానికి రానా కి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది.. బాహుబలి కంటే ముందే రానా కు పలుభాషల్లో మంచి పరిచయముంది.. అంతకుముందే రానా తమిళ, హిందీ సినిమాల్లో మెరిసి ప్రేక్షకులను మురిపించాడు.. అయితే అది అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదని చెప్పాలి.. ఓ సాదా సీదా నటుడిగా మాత్రమే పరిచయమైనా రానా బాహుబలి తో ఇతను మాములు నటుడు ఏం కాదని మాత్రం చెప్పేశాడు.. బాహుబలి తర్వాత  రానా చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది.. నేనే రాజు నేనే మంత్రి సినిమా అయితే టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది అని చెప్పాలి..

ఇక ప్రస్తుతం రానా పాన్ ఇండియా మూవీ అరణ్య మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కి సంబందించి టీజర్ ని కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసి సినిమా పై మంచి అంచనాలను ఏర్పరిచేలా ప్లాన్ చేశారు.. కానీ కరోనా అన్ని సినిమాలపై ప్రభావం చూపించినట్లుగా ఈ సినిమా పై కూడా గట్టి ప్రభావం చూపించింది. ఈ ఏడాది ఏప్రిల్ 2 తారీకున దేశ వ్యాప్తంగా ఒకే సారి విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది.

దాదాపు 7 నెలలు ఈ సినిమా రిలీజ్ఆగిపోయింది. తాజాగా దీన్ని డిజిటల్ రిలీజ్ కే ఇవ్వబోతున్నట్టు ముంబై టాక్. థియేటర్లు తెరుచుకున్నాక ఇలాంటి నిర్ణయం ఏమిటా అని ఆశ్చర్యం కలగొచ్చు కానీ దానికి కారణాలు లేకపోలేదట. దీపావళి దాకా సినిమా హాళ్లకు కనీస కలెక్షన్లు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఒకవేళ పండగ సమయానికి ఏవైనా కొత్త సినిమాలు విడుదల చేసినా అప్పటికి ప్రభుత్వం ఫుల్ కెపాసిటీకి పర్మిషన్లు ఇవ్వడం అనుమానమే. అలాంటప్పుడు ఇంత కాలం నిరీక్షించి ఉపయోగం ఉండదు. అందుకే కలెక్షన్ల విషయంలో కాంప్రమైజ్ ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారట..

శాకుంతలం తర్వాత గుణశేఖర్ సినిమా అదే..?

త్వరలో టాప్ 5 లోకి సాయి తేజ్ వస్తాడా..?

అల్లు అర్జున్ ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

‘సర్కార్ వారి పాట’ యాక్షన్ ప్లాన్ చేంజ్.. ఎందుకు..?

జూ ఎన్టీఆర్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -