Friday, March 29, 2024
- Advertisement -

లాక్ డౌన్: సురేష్ బాబు ఐడియాలు వర్కవుట్ అవుతాయా?

- Advertisement -

లాక్ డౌన్ తో నెలరోజులుగా థియేటర్లు అన్నీ మూసివేయబడ్డాయి. సినిమా విడుదలలు ఆగిపోయాయి. షూటింగ్స్ నిలిచిపోయాయి. లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించడంతో సినిమా పరిశ్రమకు మరితం గడ్డు కాలం ఎదురుకాబోతోంది. కరోనా భయంతో జనాలు థియేటర్స్ కు రావడం కష్టమేనని సినీ పరిశ్రమ ఆందోళన చెందుతోంది.

జూన్ తరువాతనే సినిమా పరిశ్రమ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేశం మొత్తం కూడా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు ఈ క్లిష్ట సమయంలో 100-200 పెట్టుకొని సినిమాలు చూసేందుకు థియేటర్స్ కు వస్తారా అన్న ప్రశ్న సినీ జనాలను వేధిస్తోంది.

ఈ లాక్ డౌన్ తో వచ్చిన ఆర్థిక సంక్షోభంతో చాలా మంది వేతనాల్లో కోతలు పడ్డాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. దీంతో సినిమాలు విడుదల కావడం.. అసలు కొనేందుకు కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ముందుకు వస్తారా రారా అన్నది సందేహంగా మారింది.

దీంతో టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు తాజాగా ఒక సూచన చేశారు. పరిస్థితిని బట్టి సినిమా పరిశ్రమ కూడా మారాలని ఆయన అన్నారు. కొన్ని నెలల వరకు థియేటర్స్ నడిచే పరిస్థితి లేదని సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. జనాలు భయం లేకుండా థియేటర్స్ కు రావడం ఇప్పట్లో సాధ్యంకాదన్నారు.

కరోనాకు వ్యాక్సిన్ తయారు అయి విడుదల అయితేనే జనాలు మళ్లీ థియేటర్లకు వైపుకు వస్తారని సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలు విడుదల అవ్వడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందన్నారు. ఇక థియేటర్స్ టికెట్ రేట్లను 50శాతం తగ్గించాలని సూచించారు. ప్రభుత్వం పన్ను మినహాయింపును ఇస్తేనే సినిమా పరిశ్రమ మళ్లీ నిలదొక్కుకుంటుందని అన్నారు.దీంతో లాక్ డౌన్ ముగిసినా సినీ పరిశ్రమ నిలదొక్కుకోవడం కష్టమేనన్న అభిప్రాయం సురేష్ బాబు మాటల ద్వారా వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -