Tuesday, March 19, 2024
- Advertisement -

సమంత సినిమా కి సురేష్ బాబు ట్రీట్మెంట్

- Advertisement -

దగ్గుబాటి సురేష్ బాబు ప్రస్తుతం సినిమా నిర్మాణానికి దూరం గా ఉనప్పటికీ ఎవరైనా మంచి సినిమా తీస్తే వాళ్ళని ప్రోత్సహిస్తూ కావల్సినటువంటి పెద్ద రిలీజ్ తో పాటు ప్రోత్సాహం కూడా ఇస్తున్నారు. ఇప్పటికే పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, ABCD, మెంటల్ మదిలో, ఫలక్ నుమా దాస్ వంటి చిత్రాలను సమర్పించిన ఈ బ్యానర్ త్వరలో సమంత, నందిని రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న ఓ బేబీ అనే సినిమా తో మన ముందుకి రాబోతున్నారు. కొరియన్ సినిమా మిస్స్ గ్రానీ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. నాగ శౌర్య, రావు రమేష్, సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి ఈ సినిమా లో ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

ఇటీవలే ఈ సినిమా కాపీ చూసిన సురేష్ బాబు కొన్ని సన్నివేశాలను మార్చమని ఫిలిమ్ యూనిట్ కి చెప్పినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలను కంప్లీట్ గా రీషూట్ చేసి మార్చమని సురేష్ బాబు సలహా ఇచ్చినట్లు సమాచారం. సాధారణం గా సురేష్ బాబు ఇచ్చే సలహాలు కచ్చితంగా పని చేస్తాయి. ఈ సారి సురేష్ బాబు చెప్పిన సలహాల మేరకు చిత్ర యూనిట్ ఏం చేస్తుంది అనేది వేచి చూడాలి. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఈ సినిమా జూన్ మూడవ వారం లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -