Tuesday, April 23, 2024
- Advertisement -

యాంకర్ మంజుషా ఫోటోలు డేటింగ్ యాప్ లోకి.. అందరూ షాక్..!

- Advertisement -

సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు అప్పుడప్పుడు డేటింగ్ యాప్ లో కనిపించడం అనేది సర్వసాదరణం అయిపోయింది. అనుమతి లేకుండా చాలా మంది సెలబ్రిటీల ఫోటోలను డేటింగ్ యాప్స్ లో చాలా సార్లు వాడిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ సారు యాంకర్ మంజుషా ఫోటోలు డేటింగ్ యాప్ లో ప్రత్యక్ష్యం అయ్యాయి.

గుర్తు తెలియని కొందరు మంజుషా ఫొటోలను డేటింగ్ యాప్ లో పోస్ట్ చేశారు. విషయం మంజుషా కు తెలిసి వెంటనే స్పందించింది. తన ఫొటోలను అనుమతి లేకుండా ఉపయోగించడంతో పాటు తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న సదరు యాప్స్ పై చర్యలకు మంజుషా సిద్దం అయ్యింది. ఆ యాప్స్ ను తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఉపయోగించవద్దని.. ఆ యాప్స్ యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయంటూ ఆమె పేర్కొంది.

బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా నటిగా పలు సినిమాలో నటించింది మంజుషా. ఇప్పుడు మళ్లీ నటిగా బిజీ అయ్యేందుకు ట్రై చేస్తోంది. బుల్లి తెర మరియు వెండి తెరలపై ఛాన్స్ కోసం ఈ విపత్తు సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి వర్కౌట్స్ చేసి మంచి ఫిజిక్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -