Tuesday, April 16, 2024
- Advertisement -

డియర్ కామ్రేడ్’ డిజాస్టర్ కి గల కారణం అదేనా?

- Advertisement -

‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న లు హీరో హీరోయిన్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం కృష్ణ మరియు గుంటూరు జిల్లాల్లో ఈ సినిమా బయ్యర్లకు సైతం భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. అయితే విజయ్ దేవరకొండ అభిమానులు సినిమా ఫ్లాప్ గురించి రకరకాల కారణాలను చెబుతున్నారు.

హీరో టాలెంట్ మరియు చేసే సినిమాలు పక్కన పెడితే కాస్ట్ కూడా సినిమాలు హిట్ అవ్వడం లో కీలక పాత్ర పోషిస్తుందని ఇంకొందరు చెబుతున్నారు. టాలీవుడ్ లో అందరూ దాదాపు కమ్మ మరియు కాపు హీరోలు ఉన్నారు. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ వంటి చిన్న హీరోలు బ్లాక్ బస్టర్ లు అందుకోవడం అంటే కష్టం. విజయ్ దేవరకొండ కి ఎంత కేటీఆర్ సపోర్ట్ ఉన్నప్పటికీ కేటీఆర్ ప్రభావం తెలంగాణ కి మాత్రమే పరిమితం. కాబట్టి కేటీఆర్ ఎంత విజయ్ దేవరకొండ కి మద్దతు ఇచ్చిన ఈ హీరో ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం హిట్ అందుకోలేకపోతున్నాడు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -