Friday, April 19, 2024
- Advertisement -

దీపిక పదుకొనే టాటూ ఎలా మాయమైదంటే ?

- Advertisement -

దీపిక పదుకొనే ప్రేమాయణాల గురించి అందరికి తెలిసిందే. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న ఈ భామ అరడజను మంది బోయ్ ఫ్రెండ్స్ తో షికార్లు చేసింది. దీపక ప్రేమాయణాల గురించి ఇప్పటికి బాలీవుడ్ లో కథనాలు వస్తూనే ఉంటాయి రణబీర్ కపూర్- రణవీర్ సింగ్- యువరాజ్ సింగ్- సిద్ధార్థ్ మాల్యా .. ఇంకా పలువురి పేర్లు ఈ ప్రేమకథల్లో వినిపించాయి. అయితే ఎన్ని ఎఫెర్లు ఉన్న రణబీర్ కపూర్ తో ప్రేమాయం మాత్రం నిరంతరం హాట్ టాపిక్.

వీరి లవ్ స్టోరీ చాలా స్ట్రాంగ్ అని బాలీవుడ్ ప్రేక్షకులు ఇంకా నమ్ముతున్నారు. రణబీర్ కపూర్ తో నిండా ప్రేమలో మునిగి ఉన్నప్పుడు.. ఆర్.కే (రణబీర్ కపూర్) అంటూ రెండక్షరాల్ని తన మెడ వెనక భాగంలో పచ్చబొట్టు (టాట్టూ) పొడిపించుకుంది. అది ఎప్పటికీ చెరగని శాశ్వత టాట్టూ. దాంతో రణవీర్ సింగ్ ని పెళ్లాడినా కానీ అది చెరిగిపోలేదు. దానిపైనా ఫోటో ఆధారాలతో అప్పట్లో మీడియాలో బోలెడన్ని కథనాలు వేడెక్కించాయి. తర్వాత ఆ టాటూ మాయమైంది. ఇటీవలే చపాక్ రిలీజ్ ప్రమోషన్స్ కి వెళ్లినప్పుడు బ్యాక్ లెస్ ఫోజులో కనిపించిన దీపిక మెడపై పరిశీలిస్తే అక్కడ ఆ టాట్టూ కనిపించలేదు.

ఇంతకీ ఆ టాట్టూని ఎలా చెరిపేయగలిగారు? అంటూ బాలీవుడ్ మీడియా ప్రశ్నిస్తే.. దానికి సమాధానం ఇవ్వకుండా గుర్రుగా ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి వైపు కెమెరా వైపు చూస్తూ ఉండిపోయిందట. ఇక ఆ శాశ్వత టాట్టూ చెరిగిపోలేదని… అంతా మేకప్ జిమ్మిక్ అని సోషల్ మీడియాల్లో డిబేట్లు నడిచాయి అప్పట్లో. చపాక్ లో యాసిడ్ ఎటాక్స్ బాధితురాలు.. సామాజిక కర్త లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక నటించిన సంగతి తెలిసిందే. అన్నట్టు ఆ ప్రశ్న అడిగినప్పుడు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దీపిక కోపంగా అలా చూస్తూనే ఎందుకని ఉండిపోయింది? అంటే.. అలాంటి చెత్త ప్రశ్నలు అడగవద్దనే దానర్థం. ఇక ఎన్ని ఎఫైర్లు నడిపిన ఫైనల్ గా రణవీర్ సింగ్ ని పెళ్ళాడింది ఈ పొడువుకాల ముద్దుగుమ్మ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -