Saturday, April 20, 2024
- Advertisement -

తన లవ్ స్టోరీ చెప్పిన యాంకర్ దీప్తి నల్లమోతు..!

- Advertisement -

ప్రముఖ ఛానెల్ లో యాంకర్ గా ఉన్న దీప్తి నల్లమోతు.. బిగ్ బాస్ రెండో సీజన్ లో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిచింది. ఈమె విజయవాడకు చెందిన శ్రీకాంత్ ను లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు. అయితే తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చారు దీప్తి. ’మాది, అతనిది ఒకే ఊరు. ఇద్దరి ఇల్లులు ఎదురు ఎదురుగానే ఉంటాయి.

చిన్నప్పటి నుంచి ఒకే ఊర్లో ఎదురు ఎదుర్గా ఉండేవాళ్లం కాబట్టి కలిసి ఆడుకునేవాళ్ళం. మా ఇద్దరి ఫ్యామిలీస్ కి మంచి అనుబంధం ఉంది. మా తమ్ముడు, అతను ఒకే స్కూల్. మా తమ్ముడ్ని బాగా కేర్ చేసేవారు. ఒక విధంగా చెప్పాలంటే మాది ’నువ్వేకావాలి’ స్టోరీ. సరిగ్గా ఆ సినిమాలో ఎలా జరిగిందో .. మా లైఫ్‌లోనూ అదే జరిగింది. ప్రపోజ్ సంగతికి వస్తే.. ఆయన గురించి నాకు మొత్తం తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి.

ప్రపోజ్ రాగానే వెంటనే ఒకే చెప్పేసి.. ఇంట్లో కూడా చెప్పాం. అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూల్‌గా మా పెళ్లి అయ్యిపోయింది. సో అలా మాది లవ్ అండ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ అయింది. నువ్వే కావాలి సినిమా అప్పటికి మా లవ్ స్టోరీ స్టార్ట్ కాలేదు కాని.. తనకు ఉందేమో నాకు తెలియదు. అప్పటికి మేం స్కూల్‌కి వెళ్తున్నాం. మాది స్కూల్ లవ్ స్టోరీ కాదు’ అంటూ తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది దీప్తి నల్లమోతు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -