Thursday, April 25, 2024
- Advertisement -

బిగ్ బాస్ కి ఈ యాంకర్ ఎందుకంత స్పెషల్..!!

- Advertisement -

మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని నాలుగో సీజన్ కి ముస్తాబయింది బిగ్ బాస్.. ఈసారి మూడో సీజన్ కు వ్యాఖ్యాత గా వ్యవహరించిన నాగార్జున నాలుగోసారి కూడా హోస్ట్ గా చేస్తున్నారు.. 16 మంది సభ్యులతో బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.. ఇంక కంటెస్టెంట్స్ విషయానికొస్తే సోషల్ మీడియాలో ఎంతోకాలం నుండి ఎన్నో పేర్లు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన లిస్టులో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమంది నిజంగానే బిగ్ బాస్ లో ఉన్నారు.

అలా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ముందు నుండి వినిపించిన పేరు అరియానా గ్లోరీ.అరియానా గ్లోరీ అసలు పేరు అది కాదు అని ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో నాగార్జున అన్నారు. తన అసలు పేరు చెప్పడానికి భయపడతాను అని అరియానా గ్లోరీ చెప్పారు. సమయం కథనం ప్రకారం ఇంతకీ అరియానా గ్లోరీ అసలు పేరు ఏంటంటే అర్చన. జనవరి 25వ తేదీన పుట్టిన అరియానా గ్లోరీ వికారాబాద్ లోని తాండూర్ లో పెరిగారు.

తర్వాత హైదరాబాద్ లో యాంకరింగ్ అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు. 2015 లో స్టూడియో వన్ ఛానల్ లో యాంకర్ గా చేరారు అరియానా గ్లోరీ. ఆ తర్వాత ఈ టీవీ అభిరుచి లో కూడా యాంకర్ గా చేశారు, 2017 నుండి జెమినీ కామెడీ లో యాంకర్ గా కొనసాగుతున్నారు అరియానా గ్లోరీ. టీవీ ఛానల్స్ లో మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఫ్రీలాన్సర్ గా యాంకరింగ్ చేస్తారు అరియానా గ్లోరీ. రాంగోపాల్ వర్మతో తను చేసిన ఇంటర్వ్యూ ద్వారా అరియానా గ్లోరీ మరింత గుర్తింపును సంపాదించుకున్నారు. అంతేకాకుండా TS19MEdia ఛానల్ ఆమె చాలా ఇంటర్వ్యూ లో మంచి గుర్తింపు పొందాయి.. బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ప్రస్తుతం సీక్రెట్ రూమ్ లో ఉన్నారు అరియానా గ్లోరీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -