Wednesday, April 24, 2024
- Advertisement -

రజనీకాంత్ కుమార్తెతో లవ్, పెళ్లి గురించి చెప్పిన ధనుష్..!

- Advertisement -

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు హీరో ధనుష్. అయితే ఆయనకు తమిళంలోనే కాదు తెలుగు, హిందీ బాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆ మధ్య తన హిందీ చిత్రానికి సంబంధించి కామెడీ నైట్స్ కపిల్ షోలో పాల్గొన్నాడు ధనుష్. ఆ సందర్భంగా రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో ప్రేమ, పెళ్లి వెనుక ఉన్న కథను చెప్పుకొచ్చాడు.

నటుడిగా నాకు తొలి రోజులు అవి. యాక్టింగ్, కెరీర్‌పైనే పూర్తిగా దృష్టిపెట్టాను. ఆ టైంలో ఐశ్యర్యతో పరిచయం అయింది. అయితే తొలుత తాను పెద్దగా పట్టించుకోలేదు. నా ప్రయత్నాలన్నీ కెరీర్‌పై ఉండటంతో లవ్ మ్యాటర్ గురించి ఆలోచించలేదు. ఇక తన రెండో సినిమా కాదల్ కొండై సినిమా మార్నింగ్‌ చూడటానికి ఐశ్వర్య వచ్చింది. ఆ సమయంలో మరోసారి కలుసుకున్నాం. సినిమా చూసి బాగుందని చెప్పింది. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆమె వెళ్లేటప్పుడు నాతో కీప్ ఇన్ టచ్ అన్నారు.

ఆ పదం మా ఇద్దరిని మరింత దగ్గరికి చేర్చింది అని ధనుష్ వెల్లడించారు. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ మరింత ముదిరి పెళ్లి వరకు దారి తీసింది. ఇరు కుటుంబాలకు మా పెళ్లి విషయం చెప్పడం, వారు పెళ్లికి అంగీకరించడంతో ఎలాంటి సమస్య రాలేదు. అలా మీమిద్దరం పెళ్లి చేసుకున్నామని ధనుష్ చెప్పాడు. ధనుష్ తమిళ్ సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. ఇక ధనుష్ హిందీలో రాంజ్నా, షమితాబ్ వంటి సినిమాల్లో కూడా నటించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -