Thursday, April 25, 2024
- Advertisement -

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ ఎద‌పై టాటూ..అర్థం తెలుసా?

- Advertisement -

ఒక్క క‌న్నుగీటుతో నేష‌న‌ల్ లెవ‌ల్‌లో క్రేజ్‌ను క్రియేట్ చేసిన ప్రియా వారియ‌ర్‌.. మ‌రోసారి ఫ్యాన్స్‌కు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేసింది. ల‌వ‌ర్స్ డే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇటీవల జరిగిన లవర్స్ డే ఆడియో రిలీజ్ సందర్భంగా ప్రియా టాలీవుడ్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఆడియో వేడుకలో రెండు సరికొత్త టాటూలతో క‌నిపించి మ‌రోసారి పిచ్చెకిచ్చింది. ప్రియా వారియర్ ఎద మీద ఉన్న పచ్చబొట్టు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారిందనే చెప్పాలి. అలాగే చేతిపై మరో టాటూ క‌నిపించింది.

త‌న‌కు టాటూ వేసుకోవ‌డ‌మంటే పిచ్చి కాద‌ని కానీ కానీ అనుకోకుండా రెండు చోట్ల టాటూలు వేసుకొన్నాను అని చెప్పింది. ఎద మీద కార్ప్ డియమ్ అని.. చేతి మీద ఇన్ఫినిటి అని టాటూలు కనిపించాయి. ప్రియ ఎద మీద ఉన్న టాటూ కార్ప్ డియ్ లాటిన్ పదం. లాటిన్ బాషలో ఈ పదానికి అర్థం ఈ రోజును సొంతం చేసుకో అని అర్థం. ప్రతీ రోజు నీదైతే భవిష్యత్‌ అంతా నీదే అనే అర్థం వచ్చేలా టాటూ వేయించుకొన్నట్టు ప్రియా క్లారిటీ ఇచ్చింది. ఇక చేతిపై ఉన్న టాటూ విష‌యానికి వ‌స్తే ఇన్ఫినిటి అనే పదం ఉంది. గులాబీ కాడకు ఈ పదాన్ని చేర్చడం మరింత ఆకర్షణీయంగా కనిపించింది. గులాబీని ల‌వ్ సింబ‌ల్‌గా వాడ‌తాం. అనంతమైన ప్రేమ అని అర్థం వచ్చే విధంగా ఈ టాటూను వేసుకొన్నట్టు ప్రియా చెప్పింది. ఏదేమైనా ఈ టాటూలు ప్రియా గ్లామ‌ర్‌ను మ‌రింత పెంచింద‌న‌డంలో డౌట్ లేదు. ఫిబ్ర‌వ‌రి 14న ఓరు అదార్ ల‌వ్ నాలుగు భాష‌ల్లో రిలీజ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -