Friday, April 19, 2024
- Advertisement -

దిల్ రాజు కూతుర్ని ఎప్పుడైన చూశారా ?

- Advertisement -

ఇండస్ట్రీలో దిల్ రాజుకు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. ఆయన ఏదైన సినిమా నిర్మిస్తున్నారంటే ఆ సినిమా కచ్చితంగా హిట్ అని దాదాపు ఖాయమైనట్లే. ఎందుకంటే కథలో దమ్ము ఉంటే తప్ప ఆయన ఏ సినిమా చేయరు. ఇప్పటికే అలా చాలా సినిమాలతో హిట్ కొట్టారు.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాని అనిల్ సుంకరతో కలిసి నిర్మించారు. అయితే దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నిన్న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిన్న సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు అనౌన్స్ చేశారు. ఈ రోజు చాలా మిరాకిల్. అనిల్ రావిపూడికి బేబి బాయ్ పుట్టాడు. దిల్ రాజు గారి ఇంట ఆడపిల్ల పుట్టడం చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పారు మహేష్ బాబు. దిల్ రాజు గారికి హన్షిత ఒక్కతే కుమార్తె. ప్రస్తుతం ఆమె శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బాధ్యతలు చూసుకుంటోంది.

2014లో హర్షితా కి అచ్చిత్ రెడ్డి తో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా జనవరి 5న హన్షిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దిల్ రాజు గారి భార్య అనిత రెండేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. అనిత గారు అంటే అది రాజుగారికి చాలా ఇష్టం. ఇప్పుడు హన్షితకు పాప పుట్టడంతో అనితగారే మళ్ళీ తమ ఇంట్లో పాపల అడుగు పెట్టారని కుటుంబ సభ్యులు అంతా భావిస్తూ సంతోషంగా బేబికి గ్రాండ్ వెలకమ్ చెప్పబోతున్నారని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -