Thursday, April 18, 2024
- Advertisement -

ర‌వితేజ వ‌ద్దు… నితిన్ ముద్దు

- Advertisement -

ఇండ‌స్ట్రీలో హిట్ కొడితినే రేస్‌లో ఉంటార‌న్న సంగ‌తి ప్ర‌తి ఒక్క‌రికి తెలిసిందే. ఇక్క‌డ హిట్ లేక‌పోతే విలువ ఉండ‌దు.తాజాగా ఇదే జ‌రిగింది ర‌వితేజ విష‌యంలో. ర‌వితేజ హిట్ కొట్టి చాలాకాల‌మే అయింది. రాజా ది గ్రేట్ సినిమా త‌రువాత ఈ మాస్ రాజాకు మ‌రో హిట్ ప‌డ‌లేదు. మ‌నోడి మార్కెట్ కూడా దారుణంగా ప‌డిపోయింది. దీంతో ర‌వితేజను ఓ సినిమా నుంచి యంగ్ హీరో నితిన్‌ను తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవ‌ల సంక్రాంతికి విడుద‌లై మంచి విజ‌యం సాధించిన సినిమా ఎఫ్ -2. ఈ సినిమాలో హీరోలుగా వెంకీ, వ‌రుణ్‌లు న‌టించారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూప‌ర్ హిట్‌గా నిలిచింది.దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని అనిల్ రావిపూడి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సీక్వెల్లో ర‌వితేజ కూడా న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

‘రాజా ది గ్రేట్’ తరహాలోనే ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపిస్తాడని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా నుంచి ర‌వితేజ‌ను త‌ప్పించి నితిన్‌ను రంగంలోకి తీసుకువ‌చ్చాడ‌ట నిర్మాత దిల్ రాజు. తమ బ్యానర్‌లో శ్రీనివాస కళ్యాణం అనే డిజాస్టర్‌ని నితిన్ కు ఇచ్చామని,దాంతో ఓ హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యే దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. ఈ పాత్ర నుంచి కూడా నాన్ స్టాప్ నవ్వులు పూయించడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడట‌. ర‌వితేజకు స్పెష‌ల్ కామెడీ టైమింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. నితిన్ తెర మీద అంత యాక్టివ్‌గా క‌నిపించ‌డు.మ‌రి ర‌వితేజ చేయ‌లేని కామెడీ, నితిన్ ఎలా చేస్తాడ‌ని వీరు ఎలా భావిస్తున్నారో ఎవ్వ‌రికి అర్థం కావడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -